ఆర్ధిక నేరస్తుల కట్టడి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

NEERAV MODI, VIJAY MALYA
NEERAV MODI, VIJAY MALYA

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న ఆర్ధికనేరస్తులకు ఇక గుబులు పుట్టక తప్పదు. విజ§్‌ుమాల్యా, నీరవ్‌మోడీ వంటి పరారీలో ఉన్న ఆర్ధికనేరస్తులనుకట్టడిచేసేందుకు నిర్దేశించిన ప్రత్యేక బిల్లు రాజ్యసభలో సైతం ఆమోదం పొందింది. ఈ బిల్లుప్రకారం ఆర్ధికనేరస్తుల స్థిరాస్తులను స్వాధీనంచేసుకోవచ్చు. లేదా జప్తుచేసే అధికారాలు ఉంటాయి. రుణాలను ఎగవేసి బకాయి పడి విదేశాలకు పడిన ఆర్ధిక నేరస్తులకు ఈ బిల్లుతోముకుతాడు వేయవచ్చని అంచనా. లోక్‌సభ ఆమోదించిన వారంరోజులకు ఈ బిల్లును రాజ్యసభలో సైతం ఆమోదించారు. బిల్లు ఆమోదం విషయంలో అధికార ప్రతిపక్షాలమధ్య తీవ్ర చర్చజరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 21వ తేదీ కేంద్ర కేబినెట్‌ ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. ఆర్ధికనేరస్తులు, బకాయిదారులు రుణాలను ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్నవారికి చెందిన ఆస్తులు, ఇతర ఖాతాలను మొత్తం స్తంభింపచేసే అవకాశం ఉంటుంది. జూన్‌ 30వ తేదీ మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కోర్టు విజ§్‌ుమాల్యాను వచ్చే ఆగస్టు 27వ తేదీలోపు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌సైతం ఆర్ధికనేరస్తుణ్ణి అప్పగించాలంటూ బ్రిటన్‌కోర్టులోసైతం పిటిషన్లు దాఖలుచేసింది. 9వేల కోట్లకు సంబంధించిన బ్యాంకురుణాల ఎగవేతకు సంబంధించి మాల్యా సిబిఐ, ఇడి, ఆర్ధికనేరాల దర్యాప్తు విభాగాలనుంచి కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈతరహా ఆర్ధికనేరస్తులు భారత్‌లోమరింత ఎక్కువ మంది ఉండటంతో వీరందరికి ముక్కుతాడు వేసేందుకువీలుగా ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తెచ్చింది. తదనంతరం ఈ బిల్లును లోక్‌సభ రాజ్యసభలు ఆమోదించడంతో బిల్లు చట్టరూపంలోనికి వస్తోంది. నీరవ్‌మోడీ, మెహుల్‌చోక్సీలపై ఇప్పటికే సిబిఐ,ఇడికేసులు నడుస్తున్నాయి. మాల్యాపై తొమ్మిదివేల కోట్ల రికవరీకేసులు, నీరవ్‌మోడీ, మెహుల్‌చోక్సీలు వారి కంపెనీలుమొత్తంగా 14వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే.