కొత్త ఆవిష్కరణలకు ఎపి నాంది

Governer
Narasimhan

 కొత్త ఆవిష్కరణలకు ఎపి నాంది

విజయవాడ: రాష్ట్రప్రజలకు గవర్నర్‌ నరసింహన్‌ 69వ గణంత్ర దినోత్సవ శుబాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడి మునిసిపల్‌ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నరసింహన్‌ మాట్లాడుతూ, స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుంటున్నామని అన్నారు.. విభజన తర్వాత సమర్ధ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు.. ఆర్థిక సమస్యలున్నా అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు.

2019 కల్లా పోలవరం లక్ష్యం

సాంకేతికను అందిపుచ్చుకుని కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రం నాంది పలుకుతోందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. గణతంత్ర వేడుక సందేశంగా ఆయన మాట్లాడారు.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను అభివృద్ధి పథకంలో నడిపేందుకు సిఎం చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని అన్నారు.. 2019కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటమే ధ్యేయంగా ప్రభుత్వం కృషచేస్తోందని అనఆనరు.. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా నెలకు రూ.149కే ఇంటర్నెట్‌తో పాటు అన్ని సేవలకు కృషి జరుగుతోందని అన్నారు.. నోట్లరద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీల ప్రాత్సాహకానికి ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు.. రాష్ట్రంలో నగదురహిత లావాదేవీలకు , నైపుణ్యాభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.. పెట్టుబడుల ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ధ్యేయంగతో ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.