ఆర్థిక వృద్ధిరేటు పుంజుకుంటోంది

URGIT PATEL
URGIT PATEL

ఆర్థిక వృద్ధిరేటు పుంజుకుంటోంది

ఆర్‌బిఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌

ముంబయి, అక్టోబర్‌10: ఆర్థికాభివృద్ధికి దోహదపడే వాతావరణాన్ని కల్పించే చర్యలు తీసుకునే విష యాన్ని తాము ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నామని, అయితే ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడమే తమ ప్రధాన లక్ష్యంగా ఉండినందున దానిపై అంతగా దృష్టిపెట్టలేదని రిజర్వ్‌బ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ సోమవారం ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మూడేళ్ల కనిష్టస్థాయి 5.7శాతానికితగ్గిన తర్వాత వృద్ధిరేటు తిరిగి పుంజుకుంటోందని ఆయన చెప్పా రు.

వృద్ధిరేటు మందగించడంతో వడ్డీరేట్లను తగ్గిం చాలనే డిమాండ్లతో పాటు అన్ని వైపుల నుండి విమర్శలు సైతం వెల్లువెత్తడం తెలిసిందే. అయితే రిజర్వ్‌బ్యాంకు మాత్రం గతవారం ద్రవ్యపరపతి విధానాన్ని సమీక్షించినప్పుడు కీలకవడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. ‘ద్రవ్యవిధానం కమిటీ పథకంలో వృద్ధిఅంశం ఎప్పు డు ప్రధానంగానేఉందని, దానివైపు ఎప్పుడు దృష్టి పెట్టేఉన్నామని, అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మేము ప్రాధాన్యం ఇచ్చాం అని పటేల్‌ తెలిపారు.

ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తూనే ద్రవ్యోల్బ ణం లక్ష్యాన్ని సాధించడానికే ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు. ఆగస్టు నెలలో వినియోగదారుల ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 3.36శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. ఈఏడాది చివరి నాటి కి ద్రవ్యోల్బణాన్ని నాలుగుశాతానికి కాస్త అటు ఇటుగా పరిమితంచేయాలని ఆర్‌బిఐలక్ష్యంగా పెట్టు కున్న విషయం తెలిసిందే. ఈ లక్ష్యాన్ని సాధించడా నికి తాము గట్టిగా కృషిచేస్తామని ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడం ప్రారంభమైందని పటేల్‌ చెప్పారు.

ఆర్‌బిఐ గతవారం ఈ ఆర్థిక సంవ త్సరం వృద్ధిరేటు అంచనాలను6.7శాతానికి సవరిం చిన విషయం తెలిసిందే. అయితే చాలా మంది విశ్లేష కులు అంచనవేసిన దానికన్నా ఇది ఎక్కువగా ఉండ టం గమనార్హం.ప్రస్తుత ఆర్థికసంవత్సరం 3,4 త్రైమా సికాల్లో వృద్ధిరేటు ఏడుశాతానికి మించి ఉంటుందన్న అంచనాల ఆధారంగా ఈనిర్ణయానికి వచ్చినట్లు పటేల్‌ తెలిపారు. ఈ సంకేతాలు అప్పుడే కనిపించడం మొద లైనట్లు ఆయన చెప్పారు. గతఏడాది చివరిలో ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా తక్కువ ఇరటర్వ్యూలు ఇచ్చారు అందులో ఇది ఒకటి.