ఆర్థిక చిక్కుల్లో ఎపి

AMAR
AMARAVATI

ఆర్థిక చిక్కుల్లో ఎపి

1.80లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన వైనం
ప్రస్తుత ఏడాది వడ్డీ కిింద రూ.15,895 కోట్లు చెల్లింపు
2021-22కు రూ.3లక్షల వేల కోట్లకు చేరనున్న అప్పులు?
కృష్ణాపుష్కరాలకు రూ.4వేల కోట్లా?: ఆర్బీఐ ప్రశ్నల వర్షం

వెలగపూడి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక ప్రమాద ఘంటికలు మోగుతు న్నాయి.ఈ అభిప్రాయం ఏ ప్రతిపక్ష నాయకులో చేసింది కాదు సాక్షాత్తు భారత రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్బీఐ) ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరి చింది. ప్రభుత్వం, ము ఖ్యమంత్రి, మంత్రులు తమ ఆడంబరం కోసం ప్రత్యేక విమాన ప్రయా ణాలు ఇతర ఖర్చులు తగ్గిం చుకోవాలని ఆర్బిఐ ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇప్పటికి రూ.1,79,140కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆర్బిఐ వెల్లడిం చింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ అప్పులు రూ.3లక్షల కోట్ల మేరకు చేర నున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గణంకాలతో తెల్చి చెప్పింది.ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చులు చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 18796కోట్లు అప్పులు చేసిందన్నారు. ఇందులో రూ.12661కోట్లు అప్పులకు వడ్డీ కింద రాష్ట్రప్రభుత్వం చెల్లించిందంటే ఆర్థికంగా ఎంత దయనీయ స్థితిలో ఉందో ఆలోచించాల న్నారు.
రూ.18796కోట్లలోప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చుచేసిన సొమ్ము కేవలం రూ.6135కోట్లు మాత్రమే నని రిజర్వు బ్యాంక్‌ నిర్ధారించింది.వచ్చే ఏడాది రూ. 20,675వేల కోట్లు ఏపి ప్రభుత్వం అప్పు చేసే అవకాశం ఉందని అభిప్రాయ పడింది. ఇందులో రూ.15,985కోట్లు వడ్డీ క్రింద చెల్లించాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ అప్పులు జిఎల్‌డిపి పరిధిని దాటిందని ఆర్బిఐ హెచ్చ రించింది. ఇది 28.59 శాతం మేరకు చేరిందని ఆర్బీఐ తెలి పింది. ఇది ప్రమాదకరమైన పరిస్థితి అని అర్బీఐ అభిప్రాయ పడింది.2021-22 నాటికి రూ.3లక్షల కోట్ల మేరకు అప్పులు పెరుగుతాయని రిజర్వు బ్యాంక్‌ లెక్కలు కట్టింది.
దీంతో 2021- 22నుంచి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసా గించడం చాలా కష్టతరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజ§్‌ు కల్లం ఈ అప్పులు తీర్చడానికి ప్రత్యేక దృష్టి సారించారని ఆర్బిఐ గుర్తించింది. అయినప్పటికీ ఈ అప్పులు ఊబి నుండి ప్రభుత్వం బయట పడడడం కష్టమని అభిప్రాయపడింది. పుష్కరాలకు రూ.4వేల కోట్లు: కిందటేడాది ఆగస్టు సెప్టెంబర్‌ నెలలో జరిగిన కృష్ణానది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుచేసిందని రిజర్వు బ్యాంక్‌ వెల్లడించింది.పుష్కరాలకు ఇంత వ్య యం ఎందుకని అభిప్రాయపడింది. ప్రతి పర్యటనకు ప్రత్యేక విమానాలు వినియోగించే ఏపి సీఎం నారా చంద్రబాబు ప్రభుత్వ నిర్వహణ వ్యయాన్ని తగ్గిస్తామంటే ఎలా విశ్వసిస్తామని ఆర్బిఐ ప్రశ్నించింది. వీలైనంత మేరకు ముఖ్యమంత్రి ప్రభుత్వం తమ ఆడంబరాలకోసం ప్రత్యేక విమానాలు,ఇతర ఖర్చులను తగ్గించుకోవాలని రిజర్వు బ్యాంక్‌ సూచించింది.