ఆర్థిక గణాంకాలే కీలకం

bse
bse

ఆర్థిక గణాంకాలే కీలకం

ముంబై,: దేశీయ స్టాక్‌మార్కెట్లు వచ్చే వారం విడుదలయ్యే ఆర్థిక గణాంకాల ఆధారం గా కీలకంగా పనిచేస్తాయని చెప్పవచ్చు. శుక్రవారమే పారిశ్రామిక ఉత్పత్తిసూచి ఐఐపి గణాంకాలు విడు దలయ్యాయి. డిసెంబరునెలలో ఐఐపి 0.4శాతం క్షీణించింది. నవంబరునెలలో 5.7శాతంగా ఉన్న ఐఐపి డిసెంబరులో తగ్గింది. ఈ ప్రభావం సోమ వారం నుంచి కొనసాగే మార్కెట్లపై చూపిస్తుంది. వినియోగరంగం, భారీయంత్ర పరికరాల ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని విశ్లేషకుల అంచనా. ఏప్రిల్‌ డిసెంబరునెల కాలానికి కూడా ఐఐపి 0.3 శాతం మాత్రమే పుంజుకుంది. జనవరి నెల విని యోగరంగధరలసూచి ఆధారితద్రవ్యోల్బణ గణాం కాలు సోమవారం మార్కెట్లు ముగిసాక విడుదల వుతాయి. డిసెంబరులో రిటైల్‌ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్టస్థాయికి అంటే 3.41శాతానికి దిగ జారింది. ఇదేవిధంగా జనవరిటోకుధరలసూచి ఆధా రిత ద్రవ్యోల్బణం కూడా మంగళవారం విడుదలవు తాయి. డిసెంబరులో ద్రవ్యోల్బణం 3.4శాతం పెరి గిన సంగతి తెలిసిందే.

వీటితోపాటు ఇకపై వెల్లడి కానున్న మూడోత్రైమాసిక ఫలితాలు కూడా మార్కె ట్లధోరణులను నిర్దేశిస్తాయి. ఇప్పటివరకూ పలు బ్లూచిప్స్‌ కంపెనీల్లో ఈ ఏడాది 3వ త్రైమాసిక ఫలి తాలు వెల్లడిస్తే 11వ తేదీ కోల్‌ ఇండియా, క్రిసిల్‌, ఐడియా, మహానగర్‌గ్యాస్‌, ఆర్‌కామ్‌, 13న బ్రిటా నియా, జిఎంఆర్‌, జిఎస్‌కె హెల్త్‌, హిందాల్కో, జెపి, ఎంఎంటిసి, మదర్‌సన్‌, నాల్కో, ఎన్‌బిసిసి, ఎన్‌ఎండిసి, పిఎప్‌సి, 14న సన్‌ఫార్మా, టాటామోటార్స్‌, అదాని ఎంటర్‌ప్రైజెస్‌ పోర్టులు, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌, ఆర్‌ఇసి స్పైస్‌జెట్‌, వోల్టాస్‌, 15న నెస్లే పనితీరు వెల్లడి అవుతుంది. ఇకపోతే వారం మధ్యలో పెట్రో ఉత్పత్తులధరల సవరణ చేపట్టనున్న చమురు మార్కెటింగ్‌ కంపెనీ లపై ట్రేడర్లు కన్నేయనున్నట్లు విశ్లేషకులు చెప్పారు. కాగా వీటితోపాటు ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐలు, పెట్టుబడులు డాలరు తో మారకంలో రూపాయికదలికలు, విదేశీ మార్కెట్లట్రెండ్‌ వంటి అంశాలు కూడా దేశీ యంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేయ గలవని నిపుణులు వివరించారు. అంత ర్జాతీయ స్థాయిలో చూస్తే ఆదివారం 12వ తేదీ జపాన్‌ నాలుగోత్రైమాసికం జిడిపి గణాంకాలు విడుదలవుతున్నాయి. జనవరి నెలకు చైనా సిపిఐ వివరాలు సోమవారం వెల్లడువతాయి. అమెరికా సిపిఐ గణాంకాలు బుధ వారం రిటైల్‌అమ్మకాల వివరాలు విడుదలవుతాయి. వీటి ఆధారంగానే మార్కెట్లు ట్రేడ్‌ అవుతాయి.