ఆర్టీజిఎస్ ఏపి ప్రజలకు హెచ్చరిక

అమరావతి: ఏపి ప్రజలకు ఆర్టీజిఎస్ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉండడంతో ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఏపిలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్రోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నట్లు ఆర్టీజిఎస్ తెలిపింది. వడగాల్పులు వీస్తాయని ఎండలో వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణించాలని తెలిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/