ఆర్కెనగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా సాగుతోంది

దేశ వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న ఆర్కెనగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 11 గంటల వరకూ దాదాపు పాతిక శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ త్రిముఖ పోరు హోరాహోరీగా సాగుతుందని పరిశీలకులు చెబుతున్నారు. అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకే తో పాటు ఇటీవల అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన టీటీవీ దినకరన్ వర్గం అభ్యర్థి మధ్యా పోటీ తీవ్రంగా ఉంది.