ఆర్ఆర్ఆర్ : భీమ్ స్పెషల్ టీజర్

ఎన్టీఆర్ విప్లవవీరుడు ‘కొమరం భీమ్’ స్పెషల్ టీజర్

‘ఆర్.ఆర్.ఆర్’ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన తరుణం వచ్చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ విప్లవవీరుడు ‘కొమరం భీమ్’ గా ఇండియన్ బాక్సాఫీస్ కు తన సత్తా చూపించబోతున్నాడనే దానికి సాక్ష్యంగా తాజాగా స్పెషల్ టీజర్ ని విడుదల చేశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పినట్లుగానే ‘భీమ్ ఫర్ రామరాజు’ కి రిటర్న్ గిఫ్ట్ గా ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ తారక్ కి అదిరిపోయే విజువల్ ట్రీట్ ఇచ్చాడు.

”వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి.. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి దైర్యం చీకట్లని చీల్చే మండుటెండ..

వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ.. నా తమ్ముడు గోండు బెబ్బులి.. కొమరం భీమ్” అంటూ రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేశాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/