ఆరోపణలు నిజమైతే…నా కొడుకును సైతం వదలోద్దు: రొడ్రిగో డ్యుటర్టె

phillipenes president rodrigo dutarte
phillipenes president rodrigo dutarte

మనీలా: ఫిలిప్పీన్స్‌లో డ్రగ్‌ మాఫీయాను ఆరికట్టేందుకే తాను ఆధ్యక్షుడిగా పోటీ చేస్తున్నానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన
రొడ్రిగో డ్యుటర్టె ఆధికారంలోకి వచ్చాక చెప్పినట్లుగానే డ్రగ్స్‌ను ఆరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మాదక
ద్రవ్యాలు వినియోగించేవారు, ఆక్రమంగా రవాణా చేసేవారు ఆరెస్టులకు తిరగబడితే చంపాలంటూ పోలీసులకు ప్రత్యేక
ఆదేశాలిచ్చారు. ఒక వేళ ఈ డ్రగ్స్‌ అక్రమ రవాణాలో తన కొడుకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు నిజమైతే తన కుమారుడిని
సైతం కాల్చేయాలని సంచలన నిర్ణయం ప్రకటించాడు. ఇటీవలే రొడ్రిగో కుమారుడు పాలో డ్యుటర్టె చైనా డీలర్లతో చేతులు
కలిపి అక్కడి నుంచి డ్రగ్స్‌ దేశంలోకి ఆక్రమంగా రవాణా చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత ఒకరు ఆరోపించారు. దీనిపై రొడ్రిగో
స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే ‘నా పిల్లలకు డ్రగ్‌ మాఫీయాతో ఎలాంటి సంబంధం లేదని గతంలోనే చెప్పాను.
అయితే ఒకవేళ వారు అక్రమ రవాణాకు పాల్పడితే గనుక వారిని కూడా చంపేయండి. అప్పుడు నన్ను వేలెత్తి చూపలేరు.
ఇదే విషయాన్ని నేను పాలోకు కూడా చెప్పాను. ‘ఒకవేళ నువ్వు డ్రగ్‌ మాఫీయాలో గనుక పట్టుబడితే..నిన్ను చంపేయమని
ఆదేశిస్తాను అని చెప్పాను. ఆదే జరిగితే పాలోను చంపిన పోలీసులకు రక్షణ కూడా కల్పిస్తాను అని చెప్పారు.