ఆరోగ్య చిట్కాలు

Healthy tips
– అన్నంతో పాటు టమాట, దోసకాయ, కేరట్‌, ముల్లంగి ముక్కలు సన్నటి ముక్కలుగా కోసిన కేబేజ్‌ని తింటే శరీరానికి కావలసిన విటమిన్స్‌ లభిస్తాయి.
– అకస్మాత్తుగా అన్నం తగ్గిస్తే కడుపుకుండే ఎలాస్టిసిటీ వల్ల ఆకలి వేస్తుంది. అంచేత క్రమక్రమంగా అన్నం తగ్గించుకుంటూ వెళితే కడుపు ముడుచుకుని ఆకలి తగ్గుతుంది.
– లావుగా ఉన్నవాళ్లు డైటింగ్‌ చేయాలనుకుంటే కార్బొహేడ్రేట్స్‌, కొవ్వు పదార్థం గల ఆహారపదార్థాలనే తినడం మానేయాలి తప్ప విటమిన్స్‌, ప్రొటీన్స్‌ గల పదార్థాలను మానేయకూడదు.
– రోజుకి రెండు అరటిపండ్లు తింటే, రోజూ మనిషికి కావలసిన ‘సి’ విటమిన్‌లో నాలుగోవంతు లభ్యమవుతుంది.
– హైబి.పి ఉన్నవారు కొలెస్టరాల్‌ అధికంగా ఉన్నవారు రోజూ ఉదయం అన్నం తినబోయే ముందు నాలుగు వెల్లుల్లి బద్దలు తింటే మంచిది. పచ్చివి తినడం కష్టం కాబట్టి అన్నం ఉడికాక అందులో ఆ నాలుగు బద్దలని గుచ్చి ఉంచితే, వేడి చల్లారేలోగా అవి ఉడుకుతాయి. వాటిని తినచ్చు.
– గోరుచుట్టు వచ్చినప్పుడు గోరింట ముద్ద ఆ వేలికి కొన్నాళ్లు పూస్తే ఉపశమనాన్నిస్తుంది.
– కళ్లజబ్బు ఉన్నవారు కేరట్స్‌, యాపిల్స్‌ అధికంగా తింటే (కంటికి అవసరం అయిన కెరొటిన్‌ వాటిల్లో ఉంది కాబట్టి) కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
– నిద్రపట్టని రాత్రులు కొద్దిగా చక్కెరని నీటిలో కలుపుకుని తాగితే నిద్రపడుతుంది.
– హాయిగా నిద్రపట్టడానికి మరో చిట్కా. పాలలో చక్కెర కలుపుకుని వేడివేడిగా తాగి పడుకోవడం.
– ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పుదీనారసం ముఖానికి రాసుకుంటే మొటిమలు పోవటమే కాకుండా శరీరం కూడా మృదువుగా ఉంటుంది.
– పిల్లలకు కింద పడి శరీరం డోక్కుపోతే తేనే రాస్తే త్వరగా మానుతుంది. బ్యాక్టీరియా చేరదు.