ఆరోగ్యాన్నిచ్చే కూరగాయలు

VEGITABLES
VEGITABLES

ఆరోగ్యాన్నిచ్చే కూరగాయలు

ఆరోగ్యానికి శాకాహారం ఎంతమంచిదన్నది అందరికీ తెలిసిందే. కాని వాటిని తినే విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం వహించి, ముప్పు తెచ్చుకుంటున్నారు. అసలు ఏ కూరలో ఏమేమి లాభాలున్నాయి, వాటినెలా తినాలనేది తెలుసుకుందామా!

ముల్లంగి మధుమేహాన్ని తగ్గిస్తుంది.

చలికాలంలో దీన్ని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు. సీజన్‌లో దీన్ని ఎండబెట్టి ఉంచుకుంటే కావలసినప్పుడు ఉడకబెట్టుకోవచ్చు. ్య జీర్ణకోశం దెబ్బతిని జీర్ణశక్తి తగ్గిపోతే, బంగాళాదుంపను రసంగా చేసి రోజుకి రెండుసార్లు, రెండు చెంచాల చొప్పున తాగాలి. బంగాళా దుంపలను దంచి, ఆ ముద్దను కాలినచోట పెడితే మంట తగ్గిపోతుంది.

వంకాయ కూరలను వెల్లుల్లి, ఇంగువ వేసి వండుకొని తింటే జీర్ణకోశంలోని వాయువ్ఞ తొలగి కడుపు ఉబ్బరం తగ్గుతుంది. గ్యాస్‌, వాయు, వికారాలకు ఇది అద్భుతమైన ఆహారం. వంకాయలను కాల్చిగాని, ఉడికించిగాని పచ్చడి చేసుకుని తిన్నా మంచి ఫలితముంటుంది.

టమాటాలు షుగర్‌ వ్యాధిని అదుపుచేస్తాయి. సూప్‌ చేసుకొని తాగితే మంచిది. టమాటాల రసం, కాకరకాయ రసం కలిపి తాగితే అనేక రోగాలు నయమవ్ఞతాయి. డయాబెటిస్‌ని శాశ్వతంగా దూరం చేస్తుంది ఈ రసం. పచ్చిటమాటాలు ఆకలిని పెంచి అరుగుదలకు తోడ్పడతాయి. నీరసాన్ని, బలహీనతను తగ్గిస్తాయి.

ఈ రసాన్ని ఉదయం, సాయంత్రం తగినంత ఉప్పుగాని, చక్కెరగాని వేసుకొని తాగితే చర్మం ఎండిపోయినట్లుండడం తగ్గి నిగారింపు వస్తుంది.

బొప్పాయిలోని విటమిన్‌-ఎ ఉండడం వల్ల దృష్టిలోపాలను రాకుండా చూస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.

చంటిపిల్లల తల్లులు దీన్ని కూరగా చేసుకుని తింటే పిల్లలకు పాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రేగులను శుభ్రపరుస్తుంది. లివర్‌ దోషాలను సవరిస్తుంది. ్య కాకరకాయ షుగర్‌వ్యాధిని పోగోడుతుంది. కడుపులో నులిపురుగులంటే చచ్చిపోతాయి.

ఈ కూరను తరుచూ తింటుంటే, గ్యాస్‌, కడుపుఉబ్బరం, అజీర్ణం తగ్గుతాయి. ఆకలిని పెంచుతుంది. దీన్ని ఉడికించినా వేపుడుగా చేసినా, పోషకాలను కోల్పోము. వేసవికాలంలో తింటే ఎండవల్ల వచ్చే పుళ్లు, సెగగడ్డలు రాకుండా ఉంటాయి. ్య బెండకాయ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.

ఉత్తరదేశంలో బిండీ దీని జన్మస్థానం. కాచిన వారం రోజుల్లోగా వాడుకోకపోతే వేగంగా ముదరిపోతాయి. బెండకాయ విత్తనాల నుండి తీసిన నూనెను కొంతమంది వంటల్లో ఉపయోగిస్తారట. గింజలను ఎండబెట్టి, పొడిచేసి కాఫీలాగా తాగుతారట.

గుమ్మడి, దోస, సొరకాయల్లో పోషకవిలువలు ఎక్కువగా ఉండడమే కాక, శరీరానికి తగినంత నీరు కూడా లభ్యమవుతుంది.

కేరట్‌, కీరదోస, దొండకాయలు, పచ్చివాటిని తినవచ్చు. ఆరోగ్యాన్నివ్వడమే కాక, వికారాన్ని అరుచిని పోగొడతాయి. ్య అరటిదూట కడుపునొప్పిని పోగొడుతుంది. నులిపురుగులును పోగొడుతుంది. అరటిదవ్వని చిన్నచిన్నముక్కలుగా తరిగి ఎండబెట్టుకొని పౌడర్‌గా చేసుకోవాలి. ఆ పొడిని చక్కెరతోగాని, తేనెతో గాని తీసుకుంటుంటే గర్భాశయ వ్యాధులుంటే తగ్గిపోతాయి. అరటిదూట కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.

దూటలను పొడిగా చేసి తింటుంటే రక్తవిరేచనాలు తగ్గిపోతాయి. లంగ్స్‌కి రక్షణగా పనిచేసి ఊపిరితిత్తుల వ్యాధిని నివారిస్తుంది. అరటి పిందెలను ఎండబెట్టి, పొడిచేసి తింటుంటే అమీబియాసిస్‌ తగ్గుతుంది.

ముదిరిన అరటికాయను ఎండబెట్టి, పొడిచేసి తింటుంటే ఒకవేళ హెర్నియా ఉంటే తగ్గిపోతుంది. అరటి పువ్ఞ్వ కూర వడియాలు, ఊపిరితిత్తులకు మంచివి. అన్నం హితవ్ఞ కలిగిస్తుంది. పొట్టభారాన్ని తగ్గిస్తుంది. ్య కేబేజీ, కాలీఫ్లవర్‌లు కేన్సర్‌ వ్యాధిని నివారిస్తాయి. కేబేజీని రసం చేసుకొని తాగుతుంటే కడుపులోని అల్సర్‌లు మానిపోతాయి.

శరీర బరువును అదుపులో ఉంచుతుంది. 75గ్రా. కేబేజీని ముక్కలుగా చేసిగాని, రసంగాగాని తీసుకుంటుంటే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. కేబేజీని నూరి రాస్తే గజ్జి కురుపులు తామర నయమౌతాయి. కీళ్లవాపులు, పంటివ్యాధులు తగ్గిపోతాయి. శరీరంలోని అన్ని భాగాలను శుభ్రం చెయ్యడంలో దీన్ని మించినది లేదు.

చిలగడ దుంపలు అన్నం కన్నా మంచి ఆహారం అని నూతన పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పీచుపదార్థం రాగి విటమిన్‌-సిలు పుష్కళంగా లభిస్తాయి. షుగర్‌ పేషెంట్లు సైతం వీటిని తినవచ్చునని వారికి బంగాళాదుంపల కన్నా ఇవే మంచివని అంటున్నారు వైద్యులు. వీటిలో గుడ్డుతో సమానమైన ప్రోటీన్ల ఉన్నాయట. ఇక బీర, పొట్ల ఆనప, చిక్కుడు, దొండ, వగైరా, కూరగాయలన్నీ ఇటు ఆహారంగాను, అటు ఆరోగ్యానికి మంచివే.