ఆరోగ్యశాఖలో నోటిఫికేషన్లు విడుదల చేసిన టిఎస్పీఎస్సీ

tspsc
TSPSC

హైదరాబాద్‌: టిఎస్పీఎస్సీ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. టిఎస్పీఎస్సీ ఏర్పడి నేటికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా నూతన నోటిఫికేషన్లు విడుదల చేసింది. మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో టిఎస్పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్‌ సంచికను రూపొందించారు. వెబ్‌ సంచికను తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ ప్రారంభించారు. టిఎస్పీఎస్సీ దేశానికే ఆదర్శంగా నిలిపామని ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి స్పష్టం చేశారు. టిఎస్పీఎస్సీ ఏర్పడి నేటికి మూడేళ్లు అవుతున్న సందర్భంగా టిఎస్పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్‌ సంచికను ప్రారంభించుకున్నామని తెలిపారు. నేడు ఆరోగ్యశాఖకు సంబంధించి రెండు నోటిఫికేషన్లు  విడుదల చేశామన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో కంప్యూటరరైజేషన్‌ పనులు కొనసాగుతున్నాయని త్వరలో గురుకులాలకు సంబంధించిన ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి ఫలితాలు వారం లేదా పదిరోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. వచ్చే ఏడాదిలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని టిఎసీఎస్సీ వెల్లడించింది.