ఆరుశాతం వద్దనే ఆర్‌బిఐ రెపోరేట్లు

RBI
RBI

ముంబయి: రిజర్వుబ్యాంకు ఏడవ తేదీ నిర్వహించనున్న సమీక్షాసమావేశంలో రెపోరేట్ల జోలికి వెళ్లకపోవచ్చని స్పష్టం అయింది. సుమారు 15 మంది ఆర్ధికవేత్తల్లో 14 మంది వరకూ రిజర్వుబ్యాంకు రెపోరేట్లను ఆరుశాతం వద్దనే కొనసాగిస్తుందని, ఒక్కరుమాత్రమే 25 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందనివెల్లడించారు. ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ అంచనాలకు మించి పెరుగుతున్నందున వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోవచ్చని అంచనా ఉంది. ఆర్‌బిఐ వడ్డీరేట్లపై ఎంపిసి నిర్ణయానుసారి నిఘా కళ్లతోనే ఉంటుందని, ద్రవ్యోల్బణం కారణంగా వచ్చే చిక్కులను ఎంపిసి ప్రస్తావిస్తుందని అంచనా. ముడిచమురుధరలు, కనీస మద్దతుధరలు పెరగడం వంటివి ఉంటాయని స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంకు ఆర్ధికవేత్త అనుభూతి సహా§్‌ు వ్లెడించారు. ఎంపిసి పరంగా చూస్తే కొంత స్పష్టతకోసం వేచి ఉన్నదని ఆర్ధికరికవరీ కూడా మందగమనంతో ఉందని పేర్కొన్నారు. బడ్జెట్‌ప్రసంగంలో అరున్‌జైట్లీ మాట్లాడుతూ ఎంఎస్‌పి 50శాతంకుపైగా ఉంటుందని, రబీ పంటల్లో ఉత్పత్తివ్యయం పెరిగిందని, అలాగే ఖరీఫ్‌ పంటలకు సైతం పెరిగిందని అన్నారు. ఎక్కువశాతం ఆర్ధికవేత్తలు ఎంఎస్‌పి ప్రకటనలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయన్నారు. ఆహార ఉత్పత్తులధరలపై ఈ ప్రభావాన్నిముందుగా మదింపుచేయాల్సిన అవసరం ఉందన్నారు. సరఫరా వైపుచూస్తే వ్యవసాయ ఆర్ధికవ్యవస్థ ఎంఎస్‌పి ధరల్లో స్వల్పంగాపెరుగుదల వంటివి రానున్న కాలంలో ద్రవ్యోల్బణ నియంత్రణకు కీలకం అవుతాయని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ గౌరవ్‌ కపూర్‌ వ్లెడించారు. ఉత్పత్తివ్య్యంపై ఒత్తిళ్లు ఆహార ఉత్పత్తులధరలపై ప్రభావం చూపిస్తాయని అన్నారు. వ్యవసాయరంగంలో కొంత రైతులకు ఊరటనిచ్చినా ఉత్పత్తుల ధరలు మాత్రం పెరుగుతాయని, దీనివల్ల ఆహారద్రవ్యోల్బణం పెరుగుదలకుదోహదంచేస్తుందని అన్నారు. కనీస మద్దతుధర ప్రకటన రాగానే ద్రవ్యోల్బణం వినియోగరంగ ధరలసూచీ ఆధారిత్గంఆచూస్తే నాలుగుశాతానికి పైబడింది. ఆర్‌బిఐ మధ్యకాలిక లక్ష్యంగా నాలుగుశాతం నిర్ణయించిన సంగతి తెలిసిందే.కేంద్ర అర్ధగణాంకశాఖ అందించిన వివరాలను చూస్తే డిసెంబరులో 5.21శాతానికిపెరిగింది. గడచిన 17 నెలల్లో గరిష్టస్థాయిని నమోదుచేసింది. నవంబరులో 4.88శాతం, గత ఏడాది ఇదేనెలలో 3.41శాతం నమోదయింది. తక్కువబేస్‌ గణాంకాలప్రభావమే పెరుగుదలకు కీలకమని అంచనావేసారు. ఆర్‌బిఐ రిటైల్‌ద్రవ్యోల్బణం వచ్చే ఆరునెలల్లో 4.3నుంచి 4.7శాతంగా ఉంటుందని అంచనావేసింది. డిసెంబరునెలలో నిర్వహించిన వడ్డీరేట్ల సమీక్షలో అనేక అంశాలను ఆర్‌బిఐ పరిగణనలోనికి తీసుకుంది. సమీపభవిష్యత్తులోద్రవ్యోల్బణం పెరుగుతుందని ఊహించింది. ఆహారద్రవ్యోల్బణం,ముడిచమురుధరలు మరింతపెరుగుతాయని ముందుగానే హెచ్చరించింది. ఇక ఉత్పత్తి వ్యయాలు, రైతు రుణమాఫీలు కూడా కొంత ప్రతిఘాతం కలిగిస్తాయి. ఇక పెట్రోలియంఉత్పత్తులపై ఎక్సైజ్‌సుంకం తగ్గింపు కొంత ప్రభుత్వ రాబడుల్లో ప్రభావంచూపిస్తుంది. అంతేకాకుండా జిఎస్‌టి ఉత్పత్తుల్లో కొన్నింటిపై పన్నురేట్ల తగ్గించడం కూడా ఆర్ధికలోటు పై ప్రభావంచూపిస్తుందని అంచనా. ఆర్ధికపునరేకీకరణ రోడ్‌మ్యాప్‌పరంగాచూస్తే ప్రభుత్వం ఆర్ధికలోటును 2018,2019 సంవత్సరాలకుసైతం పెంచింది. 3.3శాతం, 3.5శాతంగా అంచనావేసింది. రాబోబ్యాంకు సీనియర్‌ ఆర్ధికవేత్త హుగో ఎర్కెన్‌ మాట్లాడుతూ 2018 ఏప్రిల్‌ జూన్‌త్రైమాసికంలో మాత్రమే వడ్డీరేట్ల పెంపు ఉండవచ్చని వెల్లడించారు. విభిన్నరంగాలపై పెరిగిన ద్రవ్యోల్బణ ప్రభావం వడ్డీరేట్లను పెంచకపోవచ్చని అంచనావేసారు. బైటప్రాంతాలనుంచి కూడా సమస్యలు ఎక్కువ ఉన్నాయని, దేశీయంగా కూడా కొంత సమస్య ఉత్పన్నంఅవుతుందని అంచనావేసారు. దేశీయ వినియోగం, పిఎంఐసూచీ, నిర్మాణరంగ కార్యకలాపాలు, రుణాల్లో వృద్ధి కూడా కొంత రికవరీ వంటివి ఉండవచ్చని అంచనావేసింది. కొంతమంది ఆర్ధికవేత్తలు ఆర్‌బిఐ తన వృద్ధి అంచనాలనుసైతం మందగమనంగా ఉంటాయని అంచనా. నోమురా ముఖ్య ఆర్ధికవేత్త సోనాల్‌ వర్మ మాట్లాడుతూ ఆర్‌బిఐ తన 2018 జివిఎ అంచనాలను 6.7శాతంనుంచి 6.5శాతంగా నిర్ణయించిందని, అంటే ద్రవ్యోల్బణానికి ఆస్కారం పెరుగుతున్నదని అంచనావేసింది. వీటికితోడు స్టాక్‌ మార్కెట్లపరంగా కూడా భారీ ఎత్తున దిగజారాయి. ఇన్వెస్టర్లు ఎల్‌టిసిజిపై కినుకవహించి పెట్టుబడులుమొత్తం వెనక్కితీసుకోవడంతో ఒక్కరోజే 15.21 లక్షలకోట్ల సంపద ఆవిరి అయింది. ఆర్ధికవనరులపరంగా స్టాక్‌ మార్కెట్లే కీలకం అవుతాయి. వీటికితోడు భౌగోళిక పరిస్థితులు,ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు కూడా దేశ ఆర్ధికవ్యవస్థకు ముఖ్యప్రామాణికంగా నిలవడంతో ఉత్పత్తిరంగం, సేవలరంగం, పారిశ్రామికరంగాలతోపాటు వ్యవసాయరంగ తీరుతెన్నులను కూడా రిజర్వుబ్యాంకు మానిటరీపాలసీ కమిటీ పరిగణనలోనికి తీసుకుని వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోవచ్చని ఆర్ధికవేత్తలు అంచనాలువేస్తున్నారు.