ఆరంభం నుంచే లాభాల్లో మార్కెట్లు

stocks
stocks

ముంబైః దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. మార్కెట్‌ ఆరంభం నుంచే సూచీలు లాభాలతో కళకళలాడుతున్నాయి. 150 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఆ జోరును కొనసాగిస్తోంది. అటు నిఫ్టీ 10,700 పైన ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్‌ 260 పాయింట్ల లాభంతో 35,439 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 10,760 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.