ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన భార‌త్‌

test match, johannessburg
test match, johannessburg

జొహ‌న్న‌స్‌బ‌ర్గ్ః దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్‌కు ప్రారంభంలోనే షాక్ తగలింది. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి భారత ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఫిలాందర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కేఎల్ రాహుల్(0) కీపర్ డికాక్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం రబడా వేసిన బౌలింగ్‌లో మరో ఓపెనర్ మురళీ విజయ్(8) వెనుదిరిగాడు. దీంతో ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ(6), చతేశ్వర్ పుజరా(0) ఉన్నారు.