ఆయుర్వేదంతో అందం

                    ఆయుర్వేదంతో అందం

CUTE LADY
CUTE LADY

వర్షాకాలంలో చర్మం ఆరోగ్యంగా మెరవాలంటే ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించి చూడండి.
1. నాలుగు టీస్పూన్ల గంధంపొడిలో రెండు స్పూన్ల బాధంపొడి, మూడు టీస్పూన్ల కొబ్బరినూనె వేసి కలిపిి ముద్దలా చేసి మొహానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేస్తే గంధంలోని యాంటీవైరల్‌, యాంటీసెప్టిక్‌ లక్షణాల వల్ల మొహంమీద ఉన్న మొటిమలూ, వేడిపోక్కులూ పోతాయి. బాదం చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మొత్తంగా ఈ పేస్టు మంచి బ్లీచ్‌గా ఉపయోగపడుతుంది.
2. రెండు టీస్పూన్ల పసుపూ రెండు టీస్పూన్ల బియ్యంపిండి రెండు టీస్పూన్ల టొమాటొ రసం తీసుకొని కలిపి మొహానికి మెడకి చేతులకి పట్టించి అరగంట సేపు ఉంచి కడిగేయాలి. ఇలా వారానికి నాలుగుసార్లు చేస్తే చర్మం మీదున్న నల్ల మచ్చలు పోయి కాంతివంతంగా ఉంటుంది.
3. మూడు టేబుల్‌ స్పూన్ల ఆలోవెరా గుజ్జులో, టేబుల్‌ స్పూన్ల నిమ్మరసం కలిపి పడుకునే ముందు మొహానికి పట్టించి రాత్రంతా ఉంచి కడిగేయాలి. ఆలోవెరాలోని యాంటీఆక్స్‌డెంట్లు చర్మానికి మెరుపు తెస్తాయి.
4. పది తులసి ఆకులుపది వేప ఆకులు రెండు స్పూన్ల రోజ్‌ వాటర్‌ తీసుకొని పేస్టులా రుబ్బి మొహానికి పట్టించి అరగంట సేపు ఉంచాలి. ఇలా వారానికి నాలుగుసార్లు చేస్తే మొహాంమీద ఉన్న మొటిమలు పొక్కులు అన్నీ పొతాయి. మృతకణాలు తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
5. రెండు టీస్పూన్ల ఉసిరి పొడిలో రెండు టీస్పూన్ల బొపాయి గుజ్జు వేసి గోరువెచ్చని నీటితో పేస్టులాచేసి ి మొహానికి పట్టించి అరగంట సేపు ఉంచాలి. ఇలా వారానికి మూడు సార్లు చేసినా మంచి ఫలితం ఉంటుంది.