ఆయన పార్టీ మారతారనేది మీడియా సృష్టే!

ayyanna patrudu
ayyanna patrudu

పశ్చిమ గోదావరి జిల్లా: దేశంలోని అన్ని పార్టీలను సియం చంద్రబాబు నాయుడు కలుపుకుని పోతున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే మళ్లీ సియం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అవంతి శ్రీనివాస్‌ పార్టీ మారతారనేది మీడియా సృష్టేనని ఆయన అన్నారు. అంతరించి పోయే పార్టీలోకి ఎవరూ వెళ్లరని, తెలంగాణలో కూటమి గెలుపు ఖాయమని అయ్యన్న పాత్రుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.