ఆమె… నానికి హెలికాప్టర్‌ కొనిస్తుందట!

Nani
ఇంటర్నెట్ డెస్క్ : నాని, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి రివ్యూలే లభించాయి. ఈ చిత్రంలో చిన్నారి అనే పాత్రలో నటించిన నైనా మొత్తం సినిమాకే ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన ముద్దుముద్దు మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్రం షూటింగ్‌ సమయంలో నానితో ప్రేమగా వ్యవహరించడమే కాదు… చిత్రీకరణ పూరైన తరువాత కూడా నైనా నానిని మర్చిపోలేదు. ఇటీవల నాని పుట్టినరోజు సందర్భంగా నైనా ఓ ఆడియో సందేశం పంపింది. ‘హ్యాపీ బర్త్‌డే నాని అన్నా… నీకు బర్త్‌డే గిఫ్ట్‌ ఇస్తా… నీకు సైకిల్‌ కావాలా… హెలికాప్టర్‌ కావాలా… ఇంకా ఏరోప్లేన్‌ కావాలా… ఇంకా ఏం కావాలి గిఫ్ట్‌? హో… ఏరోప్లేనా… కానీ నీకు ఏరోప్లేన్‌ ఇవ్వను. హెలికాప్టర్‌ ఇస్తా.. ప్రామిస్‌… బాయ్‌’ అంటూ ముద్దుగా మాట్లాడింది. ఈ వీడియోను నాని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిన్నారి పెళ్లికూతురు తనకు బర్త్‌డే మెసేజ్‌ పంపిందని, అందరూ దాన్ని వినాలని కోరుతూ పోస్ట్‌ చేశారు.