ఆమె నాకు రోల్‌ మోడల్‌

rashmika
rashmika

యంగ్‌ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ‘ఛలో.. ఈచిత్రంతో కన్నడ నటి రష్మిక మందన్న తెలుగు తెరకు పరిచయం అవుతోంది.. ఈచిత్రం ఫిబ్రవరి 2న విడుదల కాబోతోంది.. ఈసందర్భంగా హీరోయిన్‌ రష్మిక మందన్న మీడియాతో మాట్లాడారు.

మీ బ్యాక్‌గ్రౌండ్‌?
నేను కూర్‌లో 10వ తరగతి వరకు, బెంగళూరులో డిగ్రీ చేశాను.. అప్పుడే కిరిక్‌ పార్టీ ఆఫర్‌ వచ్చింది. ఫ్రెష్‌ ఫేస్‌ అని ఆఫర్‌ వచ్చింది.. అది సక్సెస్‌ కావటంతో హీరోయిన్‌గా నిలదొక్కుకున్నాను.

ఛలో సినిమాలో మీకు బాగా నచ్చిన అంశం?
ఏ సినిమాకైనా కథ ముఖ్యం.. నాకు ఇందులో అదే నచ్చింది.. ఈసినిమాతో లాంచ్‌ అయితే బాగుంటుందని చేశాను.. టీమ్‌ మొత్తం కూడ నాకు బాగా నచ్చింది. సినిమా మొత్తం పిక్నిక్‌లా జరిగింది.

ఈసినిమాలో మీ పాత్ర?
రెగ్యులర్‌ పాత్ర.. ఒక సంప్రదాయ కుటుంబ నుంచి వచ్చిన కాలేజ్‌ అమ్మాయి క్యారెక్టర్‌. అది అందరికీ కనెక్ట్‌ అవుతుంది.. అందుకే ఈసినిమాను చేయటానికి ఒప్పుకున్నాను.

ఈసినిమాను ఒప్పుకోవటానికి ప్రధాన కారణం?
ఈసినిమా కథ బాగా నచ్చింది. డైరెక్టర్‌ వచ్చి కథ చెప్పినపుడు థ్రిల్‌ అయ్యి ఓకే చేశాను.. ఈసినిమాలో నా పాత్ర బాగుంటుంది..
తెలుగులో మొదటి సినిమా చేస్తున్నారు దానిపై మీ అభిప్రాయం?
అదృష్టంగా భావిస్తున్నాను. మంచి కథ, కథనాలు ఉన్న సినిమాతో తెలుగులో లాంచ్‌ అవ్వటం ఆనందంగా ఉంది.. ముఖ్యంగా ఐరా క్రియేషన్స్‌ వంటి సంస్థలో పనిచేయటం మర్చిపోలేను.

ఈసినిమాకు ఛలో టైటిల్‌ పెట్టటానికి కారణం?
సినిమాకు ఛలో టైటిల్‌ కరెక్టు అనేది నా అభిప్రాయం.. నాకు నాగశౌర్య సినిమాకు మధ్య వచ్చే సన్నివేశాలు చూస్తే మీకే అర్ధం అవుతుంది.. ఈసినిమాకు ఛలో టైటిల్‌ కరెక్టు జస్టిఫికేషన్‌ అన్పించింది..

సినిమాలో మీ రోల్‌ మోడల్‌ ఎవరు?
సినిమాను ప్రేమించి చేస్తాను.. అందరినీ అదరిస్తాను.. అందరిసినిమాలు చూస్తాను. కానీ ఎక్కువగా అనుష్కశెట్టిని ఫౄలో అవుతాను.. ఆమె నాకు రోల్‌ మోడల్‌.

మీ తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం విజ§్‌ు దేవరకొండ సినిమాలో నటిస్తున్నానున.. ఈసినిమా తర్వాత కన్నడలో కొన్నిసినిమాలు చేస్తున్నాను.