ఆమె అంటే నాకు గౌర‌వంః అర్జున్ క‌పూర్‌

sridevi,arjun kapoor
sridevi,arjun kapoor

ఇండియా సూప‌ర్ స్టార్ శ్రీదేవి శ‌నివారం రాత్రి హఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఆమె మ‌ర‌ణం ఇప్ప‌టికి మిస్టరీగానే ఉంది. ఫోరెన్సిక్ నివేదిక‌లో ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించింద‌ని చెప్పిన‌, ఆమె అభిమానులు మాత్రం అది ముమ్మాటికి అవాస్త‌వ‌మే అని వాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో బోని క‌పూర్ మొద‌టి భార్య కుమారుడు అర్జున్ క‌పూర్ శ్రీదేవితో త‌న‌కున్న అనుబంధాన్ని ఓ ఇంట‌ర్వ్యూ ద్వారా తెలియ‌జేశాడు. శ్రీదేవి అంటే త‌న‌కి ఎంతో ఇష్ట‌మ‌ని, ఆమెని ఎంతో గౌర‌విస్తాన‌ని అర్జున్ క‌పూర్ స్ప‌ష్టం చేశాడు. తాను బాలీవుడ్‌లో రాణించాల‌ని శ్రీదేవి కోరుకునే వారని అన్నాడు. నాన్న జీవితంలోకి ప్ర‌వేశించే వారెవ‌రినైన నేను గౌర‌విస్తాను. శ్రీదేవికి చెడు జ‌ర‌గాల‌ని నేను ఎప్పుడు కోరుకోలేదంటూ తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అయితే గతంలో ఓ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన అర్జున్ కపూర్‌.. శ్రీదేవి, ఆమె కూతుళ్లు జాన్వి, ఖుషీలని ఎప్పుడూ కలవ‌ను. ఇది జరగదు కూడా అని స్పష్టం చేసిన సంగ‌తి తెలిసిందే.