ఆఫీసుకు వెళ్లే వేళ!

OFFICE WORK
OFFICE WORK

ఆఫీసుకు వెళ్లే వేళ!

మీరు ఉద్యోగస్తురాలా! అయితే మరి మీరు ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నారు. అఫిషియల్‌ లుక్‌కు సింపుల్‌గా కనిపించడమే అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. అయితే సింపుల్‌గా ఉన్నంత మాత్రాన సరిపోదు. మీరు చక్కగా కనిపించడం కూడా అవసరం. మీకు అఫిషియల్‌ లుక్‌ అందించే కొన్ని సులభమైన పద్ధతులివిగో… ్య ఆఫీన్‌ వేర్‌ కొరకు మహిళల దగ్గర ఎన్నో ఆప్షన్స్‌ ఉంటాయి. సంప్రదాయమైన చీర లేదా సల్వార్‌ కుర్తా, వెస్టర్న్‌ స్కర్ట్‌, ప్యాంట్‌, షర్ట్‌ చాలా మంచి లుక్‌ని ఇస్తాయి.

మీకు ఉన్న అవకాశాన్ని బట్టి మీరు అఫీషియల్‌ లుక్‌ కోసం వీటిలో దేనినైనా ధరించవచ్చు. ్య ఆధునిక సాంప్రదాయబద్ధమైన దుస్తులు ఏ స్టయిల్‌వి అయినా సరే అవి సాదాసీదాగా, హుందాగా ఉండేలా చూసుకోవాలి. చీరలు, డ్రెస్సులు నూలు, సిల్క్‌ లేదా ఖద్దరుని ధరిస్తే బాగుంటుంది. మోడరన్‌ స్కర్టులు, ప్యాంటు షర్టులు మంచి బ్రాండ్‌, ఫ్యాబ్రిక్‌ లేదా రెడీమేడ్‌వి మాత్రమే తీసుకోవాలి. ్య చీరలు, సల్వార్‌ సూట్‌లు హెవీవర్క్‌ ఉన్నవి, జరీ ఉన్నవి, గేరా ఉన్నవి తీసుకోకూడదు. వీటితో పాటు రెండు నుండి నాలుగు పల్చని గాజులు లేదా ఒక లావ్ఞపాటి గాజు కానీ ధరించాలి. ్య స్కర్టు, ప్లాంట్లతో టీషర్టు వేసుకోకుండా ఉండడం మంచిది. ఆఫీసుకు వెళ్లడానికి షర్టు బాగుంటుంది. ్య ప్లేయిన్‌, లైన్‌ ప్యాటర్నులు రెండూ ఉపయోగించవచ్చు. కాని పువ్ఞ్వలు, ఆకుల డిజైన్లు ఉన్నవి ధరించకూడదు.

అలాగే మెరిసే రంగులను ఎంచుకోకూడదు. ్య స్త్రీల కార్పొరేట్‌ ప్యాంటు ఎక్కువ టైట్‌గా ఉండకూడదు. ప్యాంట్‌ డ్రాప్‌ మిడ్‌ పాయింట్‌ నుండి బాటం వరకే ఉండాలి. పల్చని స్లిమ్‌ ఫిటింగ్‌ కోటు నడుము మీద సరిగ్గా ఫిట్‌ ఐతేనే స్మార్ట్‌లుక్‌ వస్తుంది. ప్రొఫెషనల్‌ లుక్‌ కోసం లో-కట్‌ స్కర్ట్‌ కింద కైమిసోల్‌ ధరించాలి. స్కర్ట్‌ కింద స్టాకింగ్స్‌ ధరించాలంటే సౌకర్యంగా ఉండే, చక్కగా ఫిట్‌ అయ్యేవే ధరించాలి. పాతవి, వదులైన స్టాకింగ్స్‌ వాడకూడదు. ్య స్కర్టు లేదా ప్యాంటుతో బ్లేజర్‌ వేసుకోవడానికి మీరు ఇష్టపడితే అన్ని రంగుల ప్యాంట్లు, షర్టులకు నప్పే చార్‌కోల్‌, గ్రే, క్రీం, టోన్‌, బ్లూ తదితర రంగుల బ్లేజర్లను ఎంపిక చేసుకోవాలి.

పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ లాంటి మెరిసే రంగుల దుస్తులు మీకు ఇష్టమైతే బ్లేజర్‌ లేదా తెలుపు రంగు షర్టు కింద స్పెగటీ లేదా అలాంటిదే మీకు నచ్చిన రంగుల్లో పల్చని లైనింగ్‌ను ధరించాలి. ్య దుస్తులు ఏవైనా సరే వాటితో పాటు డీసెంట్‌ మేకప్‌ ఉండాలి. బ్రౌన్‌ పింక్‌, బ్రౌన్‌, రస్ట్‌ లేదా ఇతర న్యూట్రల్‌ కలర్‌ లిప్‌స్టిక్‌, షాడోలను ఉపయోగించాలి. ఇవి అన్ని రకాల డ్రస్సులకు, అన్ని వయసుల వారికి నప్పుతాయి. ్య మీరు ఫౌండేషన్‌ ఉపయోగించేట్లయితే పై నుండి పొడి పౌడర్‌ను అద్దాలి. ఇలాచేస్తే ముఖం ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకేలా ఉంటుంది. ముఖం మీద ప్యాచులు తయారు కావ్ఞ. ్య జుట్టును విరబోసుకోవడం లేటెస్ట్‌ ఫ్యాషన్‌. ముందు నుండి వెనుకకు బిగించి జడ అల్లుకోవడం, కేశాలను బంధించి ఉంచడం కంటే అలా వదిలెయ్యడం మంచిది.

కేశాలు చిందరవందరగా చెదిరిపోకుండా ఉండేలా చేసుకోవాలి. దీనికోసం లేయర్డ్‌, డబుల్‌ లేయర్డ్‌, లాక్స్‌, సైడ్‌ లాక్స్‌, వన్‌ టుత్రీ లేదా మల్టీ స్టెప్స్‌ ముఖానికి ఏది నప్పితే అది చేయించండి. ్య ఫుట్‌వేర్‌ విషయానికి వస్తే మూసి ఉన్న చెప్పులు, సాండిల్స్‌ బాగుంటాయి. చెప్పులు, సాండిల్స్‌లో హైహీల్స్‌, ప్లాట్‌ ఈ రెండు రకాలూ బాగుంటాయి. హైహీల్స్‌, లెదర్‌ బెల్టుతో పెద్ద డయల్‌ ఉన్న గడియారం, బెల్లు, లెదర్‌ బ్యాగ్‌తో అద్భుతమైన లుక్‌ తీసుకురావచ్చు.