ఆఫర్‌కి ఓకేనా?

ANUSHKHA111111
ANUSHKHA

ఆఫర్‌కి ఓకేనా?

అనుష్క నటించిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌ అన్ని అనుష్కకి మంచి పేరే తీసుొచ్చాయి.. అరుంధతి, రుద్రమదేవీ వంటి చిత్రాలు అనుష్కని టాలీవుడ్‌లో టాప్‌ప్లేస్‌లో నిలబెట్టాయి.. స్టార్‌ హీరోలక ధీటుగా అనుష్క పేరు మార్మోగిపోయేది. ఇండస్ట్రీలోని స్టార్‌ హీరోలందరితో జోడీ కట్టిన ఈ భామకి బాహుబలి చిత్రం జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.. అయితే సైజ్‌జీరో తో బరువు పెరిగి దాన్ని కరిగించలేక అనుష్క నానా తంటాలు పడిన సంగతి తెలిసిందే.. ఇక బరువు కాస్త తగ్గినా ఇంకొంచెం లావుగా ఉండటంతో ఆమెకు ఇక అవకాశాలు తగ్గుతాయని భావించారంతా..
కానీ అనుష్క చేతిలో ఇపుడు అతిపెద్ద భారీ ప్రాజెక్టులే ఉన్నాయి.. ఒకటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం భాగమతి కాగా రెండోది ప్రభాస్‌ భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతున్న సాహో చిత్రంలో అనుష్క దాదాపు ఫైనల్‌అయ్యిందనే టాక్‌ వినబడుతోంది.. ఇకపోతే అనుష్క టాలీవుడ్‌లోకి వచ్చిన కొత్తలోనే మెగాస్టార్‌ చిరు స్టాలిన్‌ లో ఒక ఐటెంతో చేసి ఆకట్టుకుంది.. కానీ ఇప్పటి వరకు మరే ఇతర సినిమాలో ఐటెంలో వర్తించలేదు.
అయితే ఇపుడు మహేష్‌ భరత్‌ అనే నేను.. సినిమాలో అనుష్కని ఐటెం సాంగ్‌ కోసం కొరటాల శివ బ్యాచ్‌ అప్రోచ్‌ అవుతున్నటు వార్తలొస్తున్నాయి.. మహేష్‌-కొరటాల కాంబోలో తెరకెక్కతున్న భరత్‌ అనే నేను.. చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఐటెం సాంగ్‌ కూడ అదిరిపోయే లెవల్లో ఉండాలి అంటే.. అనుష్కతో చేయిస్తే సినిమాకి మంచి హైప్‌ క్రియేట్‌ అవుతుందని చిత్రం యూనిట్‌ భావిస్తోందట.. ఇక అనుష్కని అప్రోచ్‌ అయ్యారాలేదా అనే విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.. ఇక ఈ ఆఫర్‌ని అనుష్క ఒప్పుకుంటుందా? లేదా అనేది కూడ డౌట్‌ అంటున్నారు.. చూద్దా ఏం జరుగుతుందో?