ఆప్ఘన్‌లో రాయబారిగా విన‌య్‌ నియామకం

India
India

న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్‌కు భారత రాయబారిగా విన‌య్‌ కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్‌లో రాయబారిగా పనిచేస్తున్న మన్‌ప్రీత్‌ వోహ్రా నుంచి విన‌య్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌(ఐఎఫ్‌ఎస్‌) అధికారి ఆయన విన‌య్‌ కుమార్‌ ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వశాఖలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విన‌య్‌కుమార్‌ త్వరలో బాధ్యతలు చేపడతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.