ఆపరేషన్‌ కాంగ్రెస్‌

TRS
TRS

ఆపరేషన్‌ కాంగ్రెస్‌:  టిఆర్‌ఎస్‌ తాజా వ్యూహం
బలమైన నేతలపై గురి

హైదరాబాద్‌ : ఆపరేషన్‌ కాంగ్రెస్‌కు అధికార టిఆర్‌ఎస్‌ తాజాగా వ్యూహర రూపొందించినట్లు తెలిసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతోన్న కాంగ్రెస్‌ పార్టీని దెబ్బకొట్టేందుకు గులాబీ పార్టీ అగ్రనాయకత్వం రంగం సిద్దంచేసింది. ఇందులో తొలి అస్త్రంగా గ్రేటర్‌పై ప్రయోగించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్‌ను టిఆర్‌ఎస్‌లో చేరేలా చేసిన వ్యూహం ఫలించింది. ప్రధానంగా కాంగ్రెస్‌లోని ఆయా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో బలమైన నేతలను గుర్తించి..వారిపై ఆపరేషన్‌ ఆకర్స్‌ను ప్రయోగిస్తుంది.

వివిధ రాజకీయ కారణాలతో కాంగ్రెస్‌ పార్టీలు అసంతృప్తిగా ఉన్న కీలక నేతలను ‘కారు ఎక్కించేందుకు రాయ బారాలు సాగిస్తున్నారు. వారు కోరుకున్న సీట్లను ఇచ్చేందుకు కొంత సుముఖతను వ్యక్తం చేస్తు న్నారు. ఈపరిస్థితుల్లోనే దానం నాగేందర్‌ ఆశిం చిన సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానాన్ని ఇచ్చేందుకు గులాబీ బాస్‌ అంగీకరించినట్లు తెలు స్తోంది. అంతేకాకుండా నాగేందర్‌ సూచించిన అభ్యర్థులకే ఖైరతాబాద్‌, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు సీటు ఇచ్చేలా కూడా ఒక ఒప్పందం కుదురినట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం ‘సాగుతోంది. ఇలాగే ఇక ముందుకు కూడా టిఆర్‌ఎస్‌లోకి వచ్చే కాంగ్రెస్‌, ఇతర పార్టీల ముఖ్యనేతలకు వారికి కొంత మేలు చేసూ రాజకీయ ప్యాకేజీలు ఇవ్వటానికి అధికార పార్టీ నేతలు సిద్దంగా ఉన్నా రనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకవేళ ముందస్తు…జమిలి ఎన్నికల వచ్చినా అందుకు ఇప్పటి నుంచేస అంతా సిద్దం కావాలని ఇటీవలే పార్టీ నాయకులకు టిఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.