‘ఆపరేషన్‌ కమల్‌’కు స్వస్తి చెప్పండి

deve gowda
deve gowda

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ ఈ రోజు పార్లమెంటులో ఆపరేషన్‌ కమల్‌ గురించి ప్రస్తావించారు. ఆపరేషన్‌ కమల్‌ను చాలించాలని, ఒక స్వస్తి చెప్పాలని, ఆ పేరుతో కర్ణాటకలోని జేడిఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. 2009లో మొదటిసారి ఆపరేషన్‌ కమల్‌ అస్త్రాన్ని వినియోగించారు. ఈ తరహా ఆపరేషన్లను నిర్వహించడం మంచిది కాదని, ఇలాంటివి జరక్కూడదని దేవెగౌడ అన్నారు. పార్టీకి రాజీనామా చేస్తే రూ. 30 కోట్లు ఇస్తామని బిజెపి ఆఫర్‌ చేసినట్లు జేడిఎస్‌ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని దేవెగౌడ్‌ లోక్‌సభలో ప్రస్తావించారు.