ఆపధర్మ సిఎంపై చర్చ

ఆపధర్మ సిఎంపై చర్చ
చెన్నై: తమిళనాడు సిఎం జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందతుండటంతో రాష్ట్రంలో ఆపధర్మ ముఖ్యమంత్రిపై చర్చకు తెరలేసింది. పన్నీర్ సెల్వం ఆపధర్మ సిఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయన్న ఊహాగానాలకు బలం చేకూర్చేవిధంగా ఇవాళ గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించుకుని మాట్లాడారు. జయలలిత దీర్ఘకాలికంగా ఆసుపత్రిలో ఉండాల్సి ఉందని అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఆపధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంకు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.