ఆనందానికి ఐదు సూత్రాలు

Pandit RaviShankar
Pandit RaviShankar

ఆనందానికి ఐదు సూత్రాలు

అనగా అనగా ఒక గురువ్ఞగారు పాఠం చెబుతూ, నల్లబల్లపై ఒక గీత గీసి, ఆ గీతను చెరపకుండా చిన్నదిగా చేయమని విద్యార్థులను అడిగారు. ఎలా చేయగలం? ఆ గీతను ముట్టుకోకుండా చిన్నదిగా చేయాలి. అప్పుడు వారిలో ఒక తెలివైన విద్యార్థి లేచి ఆ గీత క్రింద మరొక పెద్ద గీతను గీశాడు. దానితో మొదటి గీత సహజంగానే చిన్నదిగా అయిపోయింది.

ఇక్కడ నీతి ఏమంటే మీ కష్టాలు చాలా పెద్దవిగా అనిపించినప్పుడు, ఒక్కసారి కనులు పైకెత్తి చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకూ మీ దృష్టిని మీపైనే కేంద్రీకరించి ఉంచారు. ఒకసారి కనులు పైకెత్తి మీ చుట్టూ ఉన్నవారిని, మీకంటే చాలా ఎక్కువ కష్టాలు పడుతున్నవారిని చూడండి. హఠాత్తుగా మీ కష్టం మీరను కున్నంత పెద్దదేమీ కాదని మీకు అనిపిస్తుంది. మీకు ఏదేనా పెద్ద కష్టం వచ్చినప్పుడు మీకంటే పెద్ద కష్టాలు పడుతున్నవారికేసి చూ డండి. మీలో ఒక ఆత్మవిశ్వాసం, నా సమస్య చిన్నది, నేను దీనిని అధిగమించగలను అనే నమ్మకం కలుగుతుంది. కాబట్టి, ఆనందంగా ఉండటానికి మొదటి సూత్రం ఏమంటే ప్రపంచంలో ఎక్కడైతే పెద్దపెద్ద సమస్యలు ఉన్నాయో అక్కడ చూడండి. అపుడు మీ సమ స్యలు చిన్నవిగా అనిపిస్తాయి. ఎప్పుడైతే మీ సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయో అప్పుడు ఆ సమస్యలను ఎదుర్కొనే, లేదా పరిష్క రించే శక్తి, ఆత్మవిశ్వాసం కలుగుతాయి.

స్థూలంగా చెప్పాలంటే ఎక్కువ కష్టాలు, ఎవరికైతే ఉన్నవో అటువంటి వారికి సహాయపడండి. సేవచేయండి. రెండ వసూత్రం. ఒకసారి మీ జీవితంలోకి తొంగి చూస్తే, గతం లో మీకుఎన్నో సమ స్యలు వచ్చాయి. అవన్నీ వచ్చి వెళ్లిపో యాయి.ఇది కూడా వెళ్లిపోతుందని, ఈ సమస్యను అధిగమించగ లిగే వక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని తెలుసుకోండి.

మీ గతాన్ని అర్థం చేసుకోవటం వలన మీలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. మూడవది అత్యంత ముఖ్యమైనది. కొద్ది సేపు యోగా, ప్రాణాయా మం చేయండి. నాలుగవది మనం కోపంగా ఉన్నప్పుడు నేను ‘ఇవన్నీ వదిలేస్తాను అని అంటూ ఉంటాము. ఇప్పుడు కోపం చికా కు ఏమీ లేకుండా ‘నేను ఈ సమస్యను వదిలేస్తాను. దీనిని నేను పరిష్కరించలేను. దైవం నాకు సహాయపడనీ అని చెప్పండి. చెప్పి మీకు సహాయం తప్పక లభిస్తుందని తెలుసుకోండి. ఆ విశ్వాసం ఉంచుకోండి. విశ్వంలోని ఒక దివ్యశక్తి మీకు సహాయపడబోతోంది. ఇక ఐదవ సూత్రం ఏమై ఉంటుందని మీరనుకుంటున్నారు? దీనిని మీకే వదిలివేస్తాను.

నేను కావాలంటే ఇరవై ఐదు, ముప్ఫై (సూత్రా లు) చెప్పగలను. కాని మీ అంతట మీరే వీటిని కనుక్కోగలిగితే బాగుంటుందని నా భావన. పరిష్కారాల కోసం మనం ఎప్పుడూ ఇతరుల వంక చూస్తాం. మన మనసును లోపలికి తిప్పగలిగితే మనకే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని మరిచిపోతున్నాం. ఇదే ఐదవ సూత్రం. సద్యఃస్ఫూర్తి. ఆలోచనను తక్షణమే ఆచరణలో పెట్టడం. వర్తమానంలో ఉండి, అప్పటికి ఏది సరైనదని అనిపిస్తే అది తక్షణమే చేయండి. మీ అంతరంగపు లోతుల్లో కొద్దినిముషాలు గడిపినప్పుడు ఇది సాధ్యమవ్ఞతుంది. అంతా సవ్యంగా ఉన్నప్పుడు మీరు ఊహించిన విధంగానే అన్నీ జరుగుతున్నప్పుడు చిరునవ్ఞ్వలు చిందించటంలో గొప్పతనమేమీ లేదు. అయితే మీలోని ధైర్యాన్ని మేలుకొలిపి, ఏదిఏమైనా కానీ, నేను చిరునవ్ఞ్వలోనే ఉంటాను. అని అన్నప్పుడు మీ లోపల అద్భుతమైన శక్తి జనించటం మీరు గమనిస్తారు. అప్పుడిక సమస్య దాదాపు శూన్యం. ఇలా వచ్చి అలా మాయమైపోతుంది.

శ్రీశ్రీ రవిశంకర్‌

(రచయిత: ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు)