ఆధార్ కార్డు ఆధార‌మే..

AADHAR
AADHAR

ఆధార్‌ తుది నిర్ధారణ పత్రం కాదు…
సందేహ నివృత్తికే ఆధార్‌ ఆదారం…
అలహాబాద్‌: సందేహ నివృత్తికే ఆధార్‌ కార్డు ఒక ఆధారం మాత్రమేనని, అదే తుది నిర్ణయమని నిర్ధారణ పత్రం కాదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా సందర్భంలో కార్డుదారుడి ఫోటో, వేలిముద్రలు, ఐరిస్‌ స్కాన్‌కు, ఆధార్‌ నంబర్‌కు మధ్య అనుసంధానం ఉందని ధృవీకరించేందుకు మాత్రమే ఇది పనికి వస్తుందని స్పష్టం చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తాము మేజర్లమని చెప్పేందుకు ఆధార్‌ కార్డులో ఉన్న పుట్టినరోజును చూపించింది. ఇద్దరి కార్డుల్లో సంవత్సరాలు వేర్వేరుగా ఉన్నా పుట్టిన తేదీ ఒక్కటే ఉంది. ఇంకా వారు అందజేసిన మరికొఇన్ని కార్డుల్లోనూ ఇలాగే ఉండటంతో ఇందుకు సంబంధించి యూఐడిఏఐ వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో లక్నోలోని యూఐడిఏఐ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్‌ జాస్మిన్‌ కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఆధార్‌ నమోదు సమయంలో ఎవరైనా పుట్టినరోజు చెప్పలేకుంటే సుమారుగా వయసు లెక్కకట్టి ఆపరేటర్లు ఓ సంవత్సరాన్ని నమోదు చేస్తారని వివరణ ఇచ్చారు. పుట్టినతేదీ మాత్రం డిపాల్ట్‌గా ఆక్యాలెండర్‌ సంవత్సరం జనవరి ఒకటిగా నమోదవుతుందని చెప్పారు. ఈ వివరణ విన్న తరువాత కోర్టు ఆధార్‌ కార్డులోని పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీలను తుది ఆధారాలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది.