ఆధార్ అద్భుతంః బిల్ గేట్స్

Bill Gates
Bill Gates

న్యూయార్క్ః భార‌త్‌లో ఆధార్ గుర్తింపు కార్డు అద్భుతమని కొనియాడారు ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్. ఇతర దేశాల్లోనూ ఇలాంటి గుర్తింపు కార్డు ప్రవేశపెట్టేందుకు వరల్డ్ బ్యాంక్‌కు తమ బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి విరాళాలు కూడా ఇచ్చారు. ఇండియాలో ఆధార్ తీసుకొచ్చిన నందన్ నీలేకని ఈ ప్రాజెక్ట్ విషయంలో వరల్డ్ బ్యాంక్‌కు సాయం చేస్తున్నట్లు గేట్స్ వెల్లడించారు. ఆధార్‌తో చాలా లాభాలు ఉన్నాయని కూడా గేట్స్ అంటున్నారు. ఇతర దేశాలూ ఈ ఆధార్‌లాంటి కార్డులను జారీ చేయాలి.