ఆధార్‌ వంటి వ్యవస్థ పై ఆసక్తి కనబరుస్తున్న మలేషియా

MALAYSIA
MALAYSIA

న్యూఢిల్లీ: భారత్‌ లోని ఆధార్‌ వ్యవస్థ పై మలేషియా ఆసక్తి కనబరుస్తోంది. తమ దేశం లోని జాతీయ గుర్తింపు కార్డులకు అధార్‌ వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని మలేసియా చూస్తోంది.సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో పారదర్శకత ఉండాలని, నకిలీలను గుర్తించడానికి ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆ దేశం కార్యాచరణ రూపొందిస్తుంది.ఈ నేపథ్యంలో మలేషియా ప్రతినిధులు ఢిల్లీలోని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ) అధికారులను కలిశారు. గత మేలో ప్రధాని మోదీ మలేషియా పర్యటనలో ఆ దేశ ప్రధాని మహ్మద్‌ మహతీర్‌ తో సమావేశం సందర్భంగా ఈ అంశం చర్చకొచ్చినట్లు మలేషియా మానవ వనరుల మంత్రి కులశేఖరన్‌ ఓ వార్తా సంస్థ తో అన్నారు. యుఐడిఎఐ సిఇఒ అజ§్‌ు భూషణ్‌ పాండే ను కలిసి తమ దేశంలో ‘మై క్యాడ్‌ గా పిలిచే గుర్తింపు కార్డులకు ఆధార్‌ వంటి వ్యవస్థను ఉపయోగించాలనే అంశంపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. భారత్‌ లో రాజ్యాగబద్ధత పై ఇటీవల సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. కాగా ఆధార్‌ చట్టం లోని కొన్ని నిబంధనలను తోసిపుచ్చుతూ ఐటి రిటర్న్స్‌, పాన్‌ సహా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్‌ ను తప్పని సరిచేసింది.