ఆధార్‌ గోప్యత… బహిర్గతంపై పిటిషన్‌

Delhi High Court
Delhi High Court

ఢిల్లీ: ఆధార్‌ విషయంలో సరైన భద్రతా నిబంధనలు పాటించకపోవడంపై డేటా బహిర్గతమైందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖాలైంది. ఆధార్‌ నుంచి నష్టపరిహారం కోరుతున్నట్లు పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని దేశంలో ప్రజలకు డిజిటల్‌ ఐడీలు అందిస్తున్న భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యుఐడిఎఐ)ను జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌ నేతృత్వంలో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 19కి వాయిదా వేసింది. భారత్‌ ప్రభుత్వం ఆధార్‌ ద్వారా 1.1బిలియన్‌ మంది ప్రజల బయోమెట్రిక్‌, జనాభా వివరాలను సేకరించింది. ప్రతి ఒక్కరికి 12అంకెలతో కూడిన డిజిటల్‌ గుర్తింపు సంఖ్యను కేటాయించింది. దీనిని ఆధార్‌గా వ్యవహరిస్తున్న విషయం విదితం. ఈ ఆధార్‌ సమచారానికి అత్యధిక భద్రత ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆధార్‌ సమాచారం బహిర్గతం గురించి వస్తున్న వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. బ్యాంకు ఖాతాలు తెరవడం దగ్గరి నుంచి వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆధార్‌ డేటా బహిర్గతం వల్ల జరిగిన నష్టాలపై నిపుణలు కమిటీ వేయాలని ఆయన కోరారు. ఆధార్‌ సమాచారంపై భద్రత లేకపోవడం వల్ల వ్యక్తిగత గోప్యతకు, గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.