ఆధార్‌కు ప్రత్యేక యాప్‌ అవసరం

ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిణామాలకు సంబంధించిన విశ్లేషణాత్మక వ్యాసాలు, మీమీ ప్రాంతాల్లో సమస్యలు పంపగోరేవారు [email protected] కు మెయిల్‌ చేయగలరు

ప్రజావాక్కు

Aadhar App

ఆధార్‌కు ప్రత్యేక యాప్‌ అవసరం: జి.అశోక్‌, గోదూర్‌, జగిత్యాలజిల్లా

ప్రతి వ్యక్తికి ఆధార్‌ కార్డు లేనిదే ఏ పనీ జరిగే పరిస్థితి లేదు. అందువల్ల ఆధార్‌ కార్డును ఎల్లప్పుడూ జేబులో ఉంచుకుని తిరగాల్సివస్తోంది. దీనిని నివారిస్తూ ఒక యాప్‌ వచ్చేసింది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవాళ్లు ఎం-ఆధార్‌ ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆధార్‌ వివరాలు ప్రదర్శించవచ్చు. ఇప్పటికే రవాణాశాఖ వారి ఆప్‌ ద్వారా డ్రైవింగ్‌ లైసెన్స్‌, బండి రిజిస్ట్రేషన్‌, బండి బీమా తదితర సమాచారం మొబైల్‌ఫోన్‌లో ప్రత్యక్షమవ్ఞతున్నాయి. వీటిని పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు ప్రయాణాల్లో అడిగినప్పుడు చూపించి తమను తాము నిరూపించుకోవచ్చు. వీటి దారిలోనే పాన్‌కార్డు,ఎంప్లాయిస్‌ ఐడికార్డు,ఓటరు గుర్తింపు కార్డులు కూడా స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే యాప్‌లు తయారు కావాలి. ఇలాంటి కార్డులన్నీ వెంట ఉంచుకుని ఇబ్బం దులు పడేకన్నా మన వెంట ఉండే స్మార్ట్‌ఫోన్‌లో అన్ని కార్డు లనూ భద్రపరుచుకుని, అవసరమైనప్పుడు వాటిని ప్రదర్శించు కునే వెసులుబాటు ఉండాలి. ఇప్పటికే రైల్వే, ఆర్టీసీ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేయించుకున్నవారికి పేపర్‌లెస్‌ టికెట్లను మన స్మార్ట్‌ఫోన్‌కి సందేశాల రూపంలో పంపిస్తున్నారు. ప్రయాణాల లో వాటిని మొబైల్‌ ఫోన్‌లో సిబ్బందికి చూపిస్తే సరిపోతుంది. కనుక కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల కార్డుల కోసం బ్యాంకు ఖాతాల కోసం ప్రత్యేక యాప్‌లను ఆవిష్కరించాలి.

విజృంభిస్తున్న సైకోలు: సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పారిశ్రామికంగా, నాగరికంగా ఎంతో వేగంతో అభివృద్ధిచెందు తున్న విశాఖనగరంలో సైకోల విజృంభణ రోజురోజుకూ ఎక్కు వ అవ్ఞతుండడంతో ప్రజలు ముఖ్యంగా యువతులు భయాం దోళనలకు గురవ్ఞతున్నారు.తెలిసీ తెలియని వయస్సులో యువ తీయువకుల అతి పరిచయాలు, వారి ప్రవర్తనను అదుపులో పెట్టాల్సిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల బాధ్యతారాహిత్యం, కాలేజీ యాజమాన్యం,పోలీసులు పట్టించుకోకపోవడం ఈ సమ స్యకు ముఖ్యకారణాలు. వెంటబడిన అమ్మాయి ప్రేమించలేదనో లేక సినిమాల ప్రభావమో యువతను సైకోలుగా మారుస్తు న్నాయి. ప్రేమోన్మాదుల దాడులు, వేధింపులను అరికట్టడమే కాకుండా రోడ్లపై మతిస్థిమితం సరిగ్గాలేని వారు చేసే దాడులను కూడా నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

రోగనిర్ధారణ పరీక్షలు ఆపండి: గోపాలుని శ్రీరామమూర్తి, గుంటూరుజిల్లా

మన రాష్ట్రంలో ప్రైవేట్‌ డాక్టర్లు చాలా అన్యాయంగా అన వసరంగా రోగనిర్ధారణ పరీక్షలు జరిపి రోగుల జేబులు కొడు తున్నారు. జ్వరం వచ్చిన వ్యక్తి డాక్టర్‌ దగ్గరు వెళ్లితే ఆ వ్యక్తికి రక్తపరీక్ష, మూత్ర పరీక్ష, మలేరియా పరీక్ష, టైఫాయిడ్‌ పరీక్ష, ఎయిడ్స్‌పరీక్ష,ఎక్సరేలు ఇలా రోగినుంచి వందలు వేలు గుంజు తున్నారు.డాక్టర్లు ఈవిధంగా రోగులకష్టార్జితమైనధనాన్ని దాచు కొని రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనుకోవడం ఘోరం. ప్రభు త్వం అటువంటి డాక్టర్లను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి.

రామజన్మభూమి సమస్య రావణకాష్ఠం: ఎం.కనకదుర్గ,తెనాలి, గుంటూరుజిల్లా

దశాబ్దాలుగా రాజకీయలబ్ధి కోసం వికృత రాజకీయ క్రీడలు ఆడే రాజకీయ పార్టీల కారణంగా రామజన్మభూమి సమస్య రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది. ముఖ్యంగా ప్రతి ఎన్నికల ముందు ఈ సమస్యను లేవనెత్తడం, తర్వాత మరిచిపోవడం జరుగుతోంది. తాజాగా అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణ కమిటి శిలాన్సస్‌ కార్యక్రమం ప్రారంభించడం, వైరిపక్షాలు వ్యతిరేకించడం, శాంతి భద్రతల సమస్యలు తలెత్తి కర్ప్యూ విధించేవరకు పరిస్థితి క్షీణిం చడం చూస్తుంటే ఈ సమస్య కావాలని పరిష్కరించకుండా లైవ్‌గా ఉంచుతున్నారన్న అనుమానం కలుగుతోంది. నిజానికి రామమంది రం సమస్య అక్కడి ప్రజలదే తప్ప కోర్టులదికాదు. ఈ విషయం లో రాజకీయపార్టీలకు ఎటువంటి సంబంధంలేదు. మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అది ఆచరణ సాధ్యంకాదు .

టీవీ సీరియల్స్‌ తెస్తున్న చేటు: వులాపు బాలకేశవులు, గిద్దలూరు,ప్రకాశంజిల్లా

ప్రతి ఇంట్లోనూ కలర్‌టి.వి, అందులో స్టార్‌ కనెక్షన్‌ తీసుకోవ డం సర్వసాధారణమైపోయింది. టీ.వీల్లో ప్రైవేట్‌ ఛానల్స్‌ పుణ్య మా అంటూ ఇంట్లో పెద్దవాళ్లకు విసుగు విరామం లేకుండా రోజూ అయిదారుసినిమాలు రకరకాల సీరియల్స్‌ వంటలు, ఫ్యాషన్లు వాటితో పాటు రకరకాల ప్రకటనలను చూస్తున్నారు. పెద్దలతో పాటు పిల్లలకూ అదే అలవాటైపోతోంది. అందువల్ల పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. సోమరితనం పెరిగిపోతోంది. ప్రకటనలకు ఆకర్షితులై కొత్తగా వచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఆరో గ్యాలు చెడగొట్టుకుంటున్నారు.

ఆనాటి స్నేహమాధుర్యాలు ఏవి?: సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

సృష్టిలో తీయనిది, అమృత తుల్యమైనది శాశ్వతమైనది స్నేహ బంధం. కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటారు. అయి తే ఆనాటి స్నేహపరిమళాలు ఈనాడు లేవ్ఞ. ఆనాడు చిన్ననాటి నుండే రకరకాల బాల్యక్రీడలతో ఆనందిస్తూ సంఘీభావంతో, ఐక్య మత్యంతో ఉండేవారు. నేడు చిన్నవయసు నుండే మొబైల్‌ గేమ్స్‌, ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియాకు బానిసలు అవుతూ తోటివారితో సంబంధం లేకుండా ఒంటరిగానే వినోదిస్తున్నారు. కృత్రిమమైన సోషల్‌ మీడియా స్నేహంతప్ప నిజమైన స్నేహబంధపు రుచులను చవిచూడటంలేదు.ఈపద్ధతిమారాలి.తిరిగి ఆనాటిరోజులు రావాలి.

వికలాంగులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌లు ఇవ్వాలి: ఆర్‌. రవీందర్‌, జనగాం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో వికలాంగులకు ప్రతి వంద ఇళ్లల్లో తప్పక మూడు ఇళ్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వికలాంగులకు ఇవ్వాలి. సొంత ఇళ్లు కట్టుకో లేని వికలాంగులకు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ద్వారా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేయాలి. ఇళ్ల దరఖాస్తులను పెండిం గ్‌లో పెట్టకుండా చూడాలి.