ఆదివాసీల నిర్భందంపై హైకోర్టులో పిటిషన్‌

TS high court
TS high court

హైదరాబాద్‌: కొమ్రుంభీం జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం వేంపల్లి ఫారెస్ట్‌ టింబర్‌ డిపోలో ఉన్న ఆదివాసులను అక్రమంగా నిర్భంధించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. శనివారం మధ్యాహ్నం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దగ్గర పౌరహక్కుల సంఘం పిటిషన్‌ దాఖలు చేసింది. గత నాలుగు రోజులుగా ఆదివాసులను అక్రమంగా నిర్భందించి చిత్రహింసలు పెడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
67 మంది ఆదివాసులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని పౌర హక్కుల సంఘం ఆ పిటిషన్‌లో కోరింది. కాగా హౌస్‌ మోషన్‌ స్వీకరించిన హైకోర్టు సాయంత్రం 4.30 గంటలకు విచారణ జరపనుంది. కోర్టు ఎలా తీర్పునిస్తుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos