ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య

suside
suside

ఆదిలాబాద్‌: జిల్లాలో ఓ ప్రేమ జంట తమ పెళ్లి జరగదని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా , నార్నూర్‌ మండలం, కంపూర్‌ లో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కన్నాపూర్‌ కు చెందిన గణేష్‌, కంపూర్‌ కు చెందిన సీతాబాయి ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొవాలనుకున్నారు. అనుకున్నట్లు గానే పెద్దలను ఒప్పించడంతొ వారు ముహుర్తం పెట్టారు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి అనగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడింది. దీంతో మనస్తాపానికి గురైన జంట, తమ పెళ్లి జరగదని భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/