ఆదిలాబాద్‌లో రూ.10 కోట్ల పట్టివేత

cash
cash

ఆదిలాబాద్‌లో రూ.10 కోట్ల పట్టివేత

హైదరాబాద్‌: µ తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నగదు అక్రమ రవాణాను గుర్తించి అడ్డుకుంటున్నారు.ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని పిప్పరవాడ చెక్‌పోస్ట్‌ దగ్గర వాహన తనిఖీల్లో రూ.10 కోట్లు పట్టుబడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దు దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న కెఎ 46 ఎం 6095 నంబర్‌ గల డస్టర్‌ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. అందులో తనిఖీ చేయగా ఎటువంటి డాక్యుమెంట్లు లేని నగదును మూడు సంచుల్లో గుర్తించారు. మహారాష్ట్ర నాగ్‌పూర్‌ జిల్లా జామ్‌ నుంచి హైదరాబాద్‌ వైపు ఈ నగదును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్‌ సర్వేశ్‌, వినోద్‌ శెట్టిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, ఈ నగదంతా రూ.500 నోట్ల కట్టల రూపంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.