ఆదాయ వనరులను పెంపొందించుకోవాలి

ap cm
AP CM Chanda babu Naidu

ఆదాయ వనరులను పెంపొందించుకోవాలి

అమరావతి:స్వయం సమృద్ధి సాధించేందుకు ఆన్ని శాఖలు ఆదాయవనరులను పెంపొందించుకోవాలని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు.. సచివాలయంలో 7 మిషన్లపై ఆయన సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడారు.. అన్ని మిషన్లపై 45 రోజులకోసారి సమీక్ష నిర్వహించాలని సిఎం నిర్ణయించారు.. ప్రతి శాఖకు ఇ-ప్రగతి తో అనుసంధానం చేయటం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.. ఆర్థికలోటు అభివద్ధికి ఆటంకం కాకుండా శాఖలను పటిష్టపరచాల్సిన బాధ్యత ఉందన్నారు.. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో 9 పట్టణాభివృద్ధి కి సబంధించినవే ఉన్నాయని పేర్కొంటూ, వాటిలో నూరుశాతం ఫలితాలు సాధించేందుకు పురపాలక శాఖ దృష్టిసారించాలని అన్నారు.. అమృత్‌ పథకం, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నిధులను పూర్తిస్థాయిలో వినియోగంచుకోవాలని పేర్కొన్నారు. పట్టణాలు అభివృద్ధి చెందేలా చూడాలని ఆయన సూచించారు.