ఆత్మవిశ్వాసానికి మీరే ఆదర్శం

CUTE
CUTE

ఆత్మవిశ్వాసానికి మీరే ఆదర్శం

టీనేజిలో అడుగుపెట్టగానే అప్పటి వరకు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్లు కాస్తా, పెద్దవాళ్లమై పోయామని అనుకోవటం సహజం. ‘ఎలా కనబడుతున్నాం అనే స్పృహవారిలో వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంటుంది. ఎన్నో సందేహాలు వేధిస్తుంటాయి. ఉన్న అందాన్ని గుర్తించలేరు, లేని అందం కోసం బాధపడకుండా ఉండలేరు. ఇలాంటి అమ్మాయికి మీరు అమ్మ అయి వుంటే ఈ మాటలు ఆమెతో చెబుతున్నారా మరి- ్య ‘చూడూ, నీవి మీ నాన్నకళ్లలాగే చాలా అందమైన కళ్లు. అలాగే నా పెదవుల్లాగే ముద్దొచ్చే పెదాలు. జన్యుపరంగా వారసత్వంగా వచ్చే వాటిని మనం ఆపలేం కదా, ఇది నీలో నీకు నచ్చని విషయాలకూ వర్తిస్తుంది. మన నియంత్రణలో లేని విషయాల గురించి అసలు బాధపడకూడదు ఇవి టీనేజిపిల్లల భావోద్వేగాలపై ఒక రచయిత మాటలు. వీటిని అర్థమయ్యేలా పిల్లలకు చెప్పాలి.

టివిలో కనిపించే తారలు, మోడల్స్‌ మీ అమ్మాయిని ఆకర్షిస్తున్నారని, వాళ్లలా లేనే అనే బాధ, వారిలా కనిపించాలనే తపన ఆమెలో మొదలైంది అంటే మీరు ఆమె మనసుని మాటలతో మరమ్మత్తు చేయాల్సిందే. టివి తారల్లా ప్రపంచం మొత్తం మీద రెండు శాతం మంది మాత్రమే ఉంటారనే నిజం మనం నమ్మి తీరాలని చెప్పండి. అద్దంలో ఆమె తనను తాను చూసుకుంటే అద్దం ఏం చెబుతుందో పక్కన ఉండి మీరూ కొన్ని విషయాలు చెప్పాలి. ‘చూడు నీ జుట్టు ఎంత అందంగా ఉందో, నిజంగా చాలా అందమైన కళ్లు నీవి,

ఇక ఈ బరువు అంటావా, కాస్త ఈ వయసు దాటితే తగ్గుతుంది. లేకపోతే దానిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయవచ్చు. నీ వయసులో నేను అలాగే చేశాను ఇలాంటి మాటలు ఆమెకు తన అందం గురించిన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ్య ‘అందంగా కనిపించడం ముఖ్యమైన విషయమే. అయితే ఎవరన్నా కొత్తవ్యక్తిని కలిసినపుడు మన రూపం, ఆకారం, అందం వారిపై ప్రభావం చూపించేది అయిదు నిముషాలపాటే. తరువాత వారిని మన రూపం కంటే తెలివితేటలు, వ్యక్తిత్వాలే ఎక్కువ ఆకర్షిస్తాయి.

మీ అమ్మాయి బరువు పెరుగుతున్నట్టు మీకు అనిపిస్తే- ‘ఇదుగో మనం తినే ఆహారంలో బరువు పెరిగేందుకు కారణమవుతున్న వాటిలో వేటినైనా పూర్తిగా వదిలేయగలమా ఆలోచించు అంటూ ఆమెను కూడా సమస్యా పరిష్కారంలో భాగం చేయండి. ‘అందరు అమ్మాయిలు కోరుకుంటున్నంత అందం నీలో ఉండకపోవచ్చు కానీ, నీలో మంచి తెలివి తేటలు ఉన్నాయి, చక్కని సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉంది. ఎవరినైనా ఆకర్షించే మాటతీరు ఉంది. ఇంకా… చక్కగా నాట్యం చేయగలవు. బొమ్మలు గీయగలవు… ఈ తరహా మాటలు మీ అమ్మాయి లో ఉన్న మంచి లక్షణాలను పెంపొం దిస్తాయని అంటున్నారు మానసిక నిపుణులు