ఆడియో విడుదల కొత్త డేట్‌

A Still From OXYGEN
A Still From OXYGEN

ఆడియో విడుదల కొత్త డేట్‌

మ్యాచో మ్యాన్‌ గోపీచంద్‌ చిత్రం ‘ఆక్సిజన్‌ అన్ని పనుల్ని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.. ఈనెల 27న సినిమా రిలీజ్‌ కానుంది.. అయితే ముందుగా ఆడియో వేడుకను ఈనెల 15న ఆదివారం నెల్లూరు వేదికగా జరపాలనుకున్నారు.కానీ వ్యక్తిగత పనులతో గోపీచంద్‌ స్విట్జర్లాండ్‌ వెళ్లటంతో అది కాస్త వాయిదా పడింది.. దీంతో నిర్మాతలు ఈకార్యక్రమాన్ని ఈనెల 23న హైదరాబాద్‌లోనే జరపాలని నిర్ణయించారు.. యవన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించిన చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటించారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ విరివిగా వాడి రూపొందించిన ఈ హెవీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.ఐశ్వర్య నిర్మించారు.