ఆటో ఘటనపై మంత్రి పోచారం దిగ్భ్రాంతి

P. Srinivas reddy
P. Srinivas reddy

నిజామాబాద్‌: మెండోరా వద్ద జరిగిన ప్రమాదంపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆటో అదుపు తప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. క్రేన్‌ సహాయంతో బావిలో పడ్డ ఆటోను వెలుపలికి తీశారు. బావిలో నుంచి 8మృత దేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదఘటనలో మరికొంత మంది ప్రయాణీకులను,స్థానికులు పోలీసులు రక్షించారు. పరిమితికి మించి ప్రయాణీకులను ఆటోలో ఎక్కించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావించారు.మృతుల కుటుంబాలకు మంత్రి పోచారం సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.