ఆటోలో న‌టుడు అక్ష‌య్ కుమార్‌

Akshay kumar
Akshay kumar

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌..తన భార్య ట్వింకిల్‌ ఖన్నాతో కలిసి ఈ ఆదివారాన్ని కాస్త ప్రత్యేకంగా గడపాలనుకున్నారు. ఇందుకోసం దంపతులిద్దరూ ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచి ఆటోలో ముంబయి వీధుల్లో షికార్లు కొట్టారు. తమ పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేరుకునేటప్పుడు ఓ ఆటోను అద్దెకు తీసుకుని అందులో ప్రయాణించారు. సరదాగా అక్షయ్‌ ఆటో డ్రైవింగ్‌ చేయగా..వెనక ట్వింకిల్‌ కూర్చున్నారు. అక్షయ్‌ ఆటో నడుపుతున్నప్పుడు తీసిన ఫొటోను ట్వింకిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈ ఆదివారం ఎంత సరదాగా గడిచిందో తెలిస్తే కొంతమందికి విడ్డూరంగా అనిపించొచ్చు. ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేచి రెండున్నర గంటలు ప్రశాంతంగా ఆర్టికల్‌ రాసుకున్నాను. ఆ తర్వాత మా పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లాను. అనంతరం నా భర్తతో కలిసి ఆటోలో షికారు కెళ్లాను. ఈ పనులన్నీ 9 గంటల లోపే పూర్తయ్యాయి’ అని పేర్కొన్నారు.