ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడంలో భారత కెప్టెన్లు ముందుంటారు

కరాచీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ లపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ముస్తాక్ అహ్మద్ ప్రశంశల జల్లు కురిపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో బౌలర్లను ఉపయోగించుకోవడంలో ధోని మాస్టర్ లాంటి వాడని, ప్రస్తుతం ఆ పనిని కోహ్లీ చేస్తున్నాడని అన్నాడు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడంలో భారత కెప్టెన్లు ఎప్పుడూ ముందుంటారని తెలిపాడు. తాజాగా ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని కోహ్లీలను కొనియాడాడు. భారత్ బౌలర్లను అద్బుతంగా ఉపయోగించుకోవడం వల్లనే మూడు ఫార్మాట్లలో ఆధిపత్యం కనబరుస్తుందని అహ్మద్ అన్నాడు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/