ఆచార్య కోదండ‌రాంపై ఎమ్మెల్యే అరుణ విమ‌ర్శ‌లు

D K Aruna
D K Aruna

తెలంగాణ జన సమితి పేరిట‌ తెలంగాణ రాజ‌కీయ ఐకాస‌ ఛైర్మన్ ఆచార్య కోదండ రామ్‌ కొత్త పార్టీ పెట్టిన విషయం విదిత‌మే. ఆయన పార్టీ గురించి కాంగ్రెస్ శాస‌న‌స‌భ్యురాలు డీకే అరుణ మాట్లాడుతూ విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించడమే కోదండరామ్‌ లక్ష్యమైతే ఆయన తమ పార్టీతో కలిసి రావాలని, అలా చేస్తేనే వారి లక్ష్యాలు నిజమైనవన్న విశ్వాసం కలుగుతుందని హితవు పలికారు. మరోవైపు.. కోదండరాంను కేసీఆర్‌ పెరట్లోని మొక్క అని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులను నిరసిస్తూ దేశ‌ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దీక్షలు చేస్తోన్న విషయం విదిత‌మే. అందులో భాగంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ నేతలు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ ఈ విధంగా కోదండ రామ్‌పై వ్యాఖ్యలు చేశారు. కాగా, కేసీఆర్‌ సర్కారు అవలంబిస్తోన్న తీరుకి నిరసనగా తాను.. జూన్‌లో  ఆలంపూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు పాదయాత్ర చేస్తానని తెలిపారు.