ఆగ‌స్టులో తెలంగాణ‌కు రాహుల్ః ఉత్త‌మ్‌

UTTAM KUMAR REDDY
UTTAM KUMAR REDDY

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటనకు సిద్ధమయ్యారు. తెలంగాణలో రాహుల్ పర్యటన ఇప్పటికే ఖరారైంది. ఆగస్టులో జరిగే ప్రజా చైతన్య బస్సుయాత్రలో రాహుల్ పాల్గొనున్నారు. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధృవీకరించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో ఒకచోట.. బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఉత్తమ్ తెలిపారు.