ఆక్టోపస్‌ బలగాలకు అధునాతన ఆయుధాలు

OCTOPUS TEAM (File)
OCTOPUS TEAM (File)

ఆక్టోపస్‌ బలగాలకు అధునాతన ఆయుధాలు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ఆక్టోపస్‌ బలగాల అమ్ముల పొదిలో సరికొత్త అధునాతన ఆయుధాలు చేరాయి. వివిఐపిలు, విఐపిల రక్షణ లో కీలక భూమిక వహిస్తున్న ఆక్టోపస్‌ బలగాలు ఇదే సమయంలో తీవ్రవాద కార్యకలాపాల అణచివేతలో ముఖ్య పాత్ర వహిస్తుండడం తెలిసిందే. ఆక్టోపస్‌ బలగాల వి ధుల నిర్వహణ ఇతర బలగాలతో పోలిస్తే కొంత కఠినంగానూ కష్టతరంగా కూడా వుంటున్న నేపథ్యంలో ఈ విభాగం సిబ్బందికి అమెరికా సహా పలు అభివృద్ది చెందిన దేశాలలో అందుబాటులో వున్న అధునాతన ఆయుధాలను సమకూర్చాలని ఉమ్మడి ఎపి హయాంలోనే నిర్ణ యించినా ఇది ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చింది.

జర్మని దేశంలో తయారైన పిఎస్‌జి 1 అనే రకం తుపాకులను తెలుగు రాష్ట్రాల ఆక్టోపస్‌ బలగా లకు ఇటీవలే అందుబాటులో వచ్చాయి. కొన్ని నెలల క్రితమే ఢిల్లీలో ప్రముఖు ల భద్రతను పర్యవేక్షించే ఎన్‌ఎస్‌జిలోని బ్లాక్‌ క్యాట్‌ కమాం డోలకు పిఎస్‌జి 1 రకం తుపాకులు అందజేశారు. ఎస్‌పిజి షార్ప్‌ షూటర్లకు వీటిని అందించారు. ఈ తుపాకుల సహాయంతో బ్లాక్‌ క్యాట్‌ కమాండోలు ప్రస్తుతం ఫ్రాక్టీస్‌ చేయసాగారు.

ఈ తుపాకులను ధరించిన బ్లాక్‌ క్యాట్‌ కమాండోలు ఢిల్లీలో ప్రముఖులకు పహారా కాస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఆక్టోపస్‌ బలగాలకు పిఎస్‌జి తుపాకులు 30 వచ్చాయి. ఇందులో 18 తుపాకులు ఎపికి వెళ్లగా 12 తెలంగాణకు అందాయి. 7.2 కిలోల బరువున్న ఈ తుపాకి టెలిస్పోకిప్‌ ద్వారా కిలోమీటర్‌ దూరం వరకు గల లక్ష్యాన్ని చూడగలిగే సామర్థ్యం కలిగి వుంది.