ఆకుకూరల్లోనే ఆరోగ్యం

Spinacth1
Spinacth

ఆకుకూరల్లోనే ఆరోగ్యం

దేహానికి అవసరమైన ఖనిజలవణాలు పుష్కలంగా ఉండేది ఆకుకూరల్లోనే. ఎందుకంటే సున్నం, భాస్వరం, ఉప్పు, ఇనుము తదితర ఖనిజలవణాలను సరాసరి స్వీకరించి, జీర్ణించుకునే శక్తి మనకు లేదు. ప్రకృతి ఆ శక్తిని వృక్షాలు, మొక్కలకు ఇచ్చింది. ఖనిజ లవణాలను అవి స్వీకరించి, సేంద్రియ లవణాల రూపంలో కాండాలలోను, ఆకులలోను, కాయలలోను, పండ్లలోను, పూలు, దుంపలతోను పదిలపరచుకుంటాయి. వాటిని మనం ఆధారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆకుకూరలలో ఇనుము విశేషంగా ఉంటుంది. ఎ,బి,సి,డి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువలన ఆకుకూరలను దేహ రక్షక పదార్థాలుగా పరిగణిస్తుంటారు. ఆకుకూరలలో గల మాంసకృత్తులు పదార్థము సులభంగా జీర్ణమై, త్వరగా శరీర థాతువ్ఞలలో కలిసిపోవ్ఞ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతి మనిషికి సగటున రోజుకు రెండు మొదలు నాలుగు ఔన్సుల వరకు ఆకుకూరలను తీసుకొనుట అవసరమని వైద్యులు అంటున్నారు. బలవర్థకమైన ఆహారం కావలసిన వారికి ఆకుకూరలు సహాయపడవ్ఞ. ్య వ్యాధి ఉధృతిని తగ్గించటానికి, తిండి ఎక్కువై వ్యాధులు వచ్చిన వారికి ఆకుకూరలు సహాయపడతాయి. ్య ఆకుకూరలు కన్నా కాయగూరలే మంచివి. ఎండలో కాయకష్టం చేసే వారికి ఆకుకూరలు అనవసరం. అనగా సూర్యరశ్మి సూటిగా తగలని వారిలో (కార్యాలయాల్లో పనిచేసేవారికి) సేంద్రియ లవణాల కొరతను ఆకుకూరలు పూరిస్తాయి.