ఆకలి చావులను కొట్టి పారేసిన త్రిపుర ప్రభుత్వం

BIPLAB KUMAR
BIPLAB KUMAR

త్రిపుర: త్రిపుర లోని గిరిజనులు ఎక్కువగా నివసించే ధలాయి జిల్లాలో ఆకలిచావులు సంభవిస్తున్నాయనే వార్తలను త్రిపుర ప్రభుత్వం కొట్టిపారేసింది.అయితే నిజనిజాలను తెలుసుకోవటానికి ధలాయి జిల్లా మేజిZసేట్‌ ఆకలి కరువు ఎదుర్కొంటున్న ప్రాంతాలలోని ప్రజల వద్దకు వెళ్లారు.ఆ ప్రాంతాలను పరిశీలించిన మేజిZసేట్‌
వికాస్‌ సింగ్‌ ప్రభుత్వానికి నివేదికను అందచేస్తూ గిరిజనులు తమకు కావలసిన ఆహారధాన్యాల కోసం గత రెండు నెలల నుంచి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. కొండ ప్రాంతాలలో ఎన్నో తరాలుగా నివసిస్తున్న గిరిజనులకు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద వారికి తగినన్ని పని దినాలను ప్రకటించాలని ఆయన
కోరారు. ఆ జిల్లా మేజిZసేట్‌ సీనియర్‌ అధికారుల బృందాన్ని వెంట తీసుకొని గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తూ ఆ ప్రాంతాలలో పలువురి స్థానికులతో మాట్లాడుతూ ఎవరెవరు పనులు లేక, ఆకలి బాధలు తాళలేక చనిపోతున్నారో వంటి వివరాలను తెలుసుకుంటున్నారు. వార్తలలో నిలిచిఉన్న ఒక వృద్ధ మహిళ ఇశంబతి
రియాంగ్‌ ధంకారా§్‌ుపర ను కలిశారు. ఆమె శారీరకంగా కుంగిపోయి ఉన్నదని, క్షుద్భాద ను తీర్చుకోవటానికి కూతురు,కొడుకు ఇంటికి చక్కర్లు కొడుతుందని వికాస్‌ సింగ్‌వెల్లడించారు.ఇద్దరి ఇళ్లలో అవసరమైన అహార ధాన్యాలు ఉన్నాయని,కొందరి ఇళ్లలో మూడు, నాలుగు నెలలకు సరిపడ అహార ధాన్యాలున్నాయని సింగ్‌ తెలిపారు.ఆ ప్రాంతాలలో ఆకలి చావులు ఉన్నాయని ఆరోపణలు రావటంతో త్రిపుర ప్రభుత్వం వెంటనే ఆ జిల్లా మేజిZసేట్‌ ను విచారణ జరిపించి నివేదిక అందజేయాలని ఆదేశించగా ఆయన ఆ ప్రాంతాలలో పర్యటించి ప్రభుత్వానికి నివేదికను ఇచ్చారు. మేజిZసేట్‌ వ్యాఖ్యానిస్తూ ఆ ఆరోపణలు చూస్తే నవ్వు వస్తుందని ఆయన తెలిపారు. కానీ సిపిఐ(ఎం) నాయకుడు ఎం.పి. జితేంద్ర చౌధురీ తాము చేసిన ఆరోపణలు నిజమని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు.