ఆకర్షణే ఆత్మవిశ్వాసం

cute
cute

ఆకర్షణే ఆత్మవిశ్వాసం

చర్మానికి నిగారింపు రావడంతో మనిషిలో ఆత్మవిశ్వాసం పెరగడం జరుగుతుంది. ఇది పెద్దగా ఖర్చు కూడా లేని చక్కని ప్రభావం కలిగిన వైద్య చికిత్సా విధానం. అయితే ఇది నిపుణులైన యాంటీ ఏజింగ్‌ వైద్యుల పర్యవేక్షణలోనే నిర్వహించాల్సి ఉంటుంది. స్టెమ్‌ సెల్‌ పీల్‌ పేరిట బ్యూటీక్లినిక్స్‌లోనూ కొన్ని రకాల ట్రీట్‌మెంట్లు జరుగుతూంటాయి. అయితే అవి చర్మంపైన మాత్రమే పనిచేస్తాయి. మూలాలకు చికిత్స చేయవ్ఞ. యాంటీ ఏజింగ్‌ చికిత్స ఒక శాస్త్రీయ వైద్య విధానం. ఇది బ్యూటీ ధెరపీ కంటే చాలా భిన్నం. కాస్మెటిక్‌ పీల్స్‌కి, స్టెమ్‌ సెల్‌ పీల్స్‌కి ఉన్న తేడాను తెలుసుకోవడం చాలా అవసరం. యాంటీ ఏజింగ్‌ నిపుణుల వద్ద స్టెమ్‌ సెల్‌ పీల్‌ చేయించుకుంటే శాశ్వతమైన, చక్కని ఫలితాలు లభిస్తాయి.

వయసు మీద పడటం, ముదిమి రావడం సహజధర్మం. వయసు మీద పడే కొద్దీ వార్థక్య లక్షణాలు వెన్నంటి వస్తాయి. చర్మం ముడతలు పడటం, కళ్లకింద, నోటి చుట్టూ గీతలు, వలయాలు ఏర్పడటం, జుట్టు తెల్లబడటం వంటివి సహజంగా వస్తాయి. దీనితో పాటు శరీరం బలహీనపడుతుంది. ఎముకలు బలహీనమౌతాయి. శరీర అవయవాల పనితీరు మంద గిస్తుంది. వీటన్నిటి వల్ల ముసలితనం ఎంతో భయకరంగా కనిపిస్తుంది.వార్థక్యం రావడం సహజం. అయితే యవ్వనంగా ఉండాలని, ఆరో గ్యంగా ఉండాలని, శారీరకంగా బలంగా ఉండా లన్న కోరిక ఉండటం అంతే సహజం.