ఆకర్షణీయంగా కనిపించాలంటే

Cute
Cute

ఆకర్షణీయంగా కనిపించాలంటే

సాధారణంగా మహిళలు తమ సౌందర్యంలో బాహ్య సౌందర్యానికి సంబంధించి ముఖంతో పాటు, చేతులకు కూడా అధిక ప్రాధాన్యత తీసుకోవాలి. చేతులు, అరచేతులు అందంగా ఉండటం అనేది పుట్టుకతో వచ్చే లక్షణాలు. వాటికి మరికొన్ని అదనపు మెరుగులుదిద్ది సున్నితంగా ఉంచుకుంటే మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అవేమిటో తెలుసుకుందాం ్య శరీరంలోని అంగాలలో ఎక్కువగా పనిచేసేది చేతులతోనే కాబట్టి. వాటికి సాధ్యమైనంత రక్షణ ఇవ్వాలన్నది గుర్తుంచుకోవాలి. కాళ్లు, చేతులకి వారానికి ఒకసారి మేనిక్యూర్‌, పెడిక్యూర్‌ చేయించాలి. అవాంఛిత ప్రదేశాలలో వెంట్రుకలను తొలగించుకునేందుకు వాక్సింగ్‌ చేయించుకోవాలి. లేదా హెయిర్‌ రిమూవర్‌ను ఉపయోగించాలి. ్య గోళ్లను పొట్టిగా కత్తిరించుకోవడం వల్ల లోతుగా పెరుగుతాయి.

అడ్డదిడ్డంగా కత్తిరించుకోవడం వల్ల గోళ్ల పలకలు పగుళ్లకు దారితీస్తాయి. గోళ్ల విషయంలో ముఖ్యంగా కాలిగోళ్ల విషయంలో రోజు శుభ్రత పాటించడం, పొడిగా ఉంచుకోవడం అవసరం. గోళ్లను కట్‌ చేసుకున్నాక సరిగా ట్రిమ్‌ చేసుకోండి. కాళ్లకు పారాణి ఎంత అందమో గోరు అంతకు మించి అందం. అలాంటి గోళ్లను ఆకర్షణీయంగా మెరుగుపరుచుకునే పద్ధతి పెడిక్యూర్‌. ఇది లాటిన్‌ పదం. ్య లాటిన్‌లో పెస్‌ అంటే పాదము. క్యూర్‌ అంటే రక్షణ. చేతులను, చేతివేళ్ల గోళ్లను అందంగా తీర్చిదిద్దే పద్ధతే మేనిక్యూర్‌. మేనిక్యూర్‌తో చేతివేళ్లకు, చేతులకు, గోళ్లకు కూడా రక్షణ. చేతివేళ్లను మృదువుగా చేసేందుకు తగిన పదార్థాలలో నానపెట్టడం అవసరాన్ని బట్టి తగిన లోషన్లు రాయటం, ఇదే పద్ధతిలో కాలివేళ్లకు చేసేది పెడిక్యూర్‌.

పేర్లు వేరయినా పద్ధతి అటూఇటూగా ఒక్కటే. ్య కాబట్టి చేతులు కడిగే ప్రతిసారీ తప్పనిసరిగా టవల్‌తో తుడవాలి. లేకపోతే డీహైడ్రేషన్‌ వల్ల చేతులు పొడిబారిపోతాయి. అలాగే తరచుగా గ్లౌజులు ఉపయోగించటం తప్పనిసరి అయితే ముందుగా చేతులకు పౌడర్‌ రాసుకుని ఆ తరువాత గ్లౌజులు వేసుకోవాలి. లేదంటే చెమట వల్ల చేతులు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవ్ఞతాయి. ్య చేతులకు తీసుకునే ట్రీట్‌మెంట్‌నే మేని క్యూర్‌ అంటారు. మేనిక్యూర్‌ అనేది లాటిన్‌ పదము. మేని అంటే చేయి అని క్యూ ర్‌ అంటే జాగ్రత్త అని అర్థం.