ఆకట్టుకునే వ్యక్తిత్వం

                               ఆకట్టుకునే వ్యక్తిత్వం

CUTE
CUTE

వ్యక్తిత్వం కేవలం బాహ్యరూపానికి సంబంధించినదే కాక, అనేకమైన విస్తృతమైన విషయాలను తనలో ఇముడ్చుకుని ఉంటుంది. వ్యక్తిత్వంలో ఆలోచనా పద్ధతి, అనుభూతుల స్రవంతి, వైఖరుల తీరుతెన్నులు ప్రవర్తనాసరళి అనేవి ఇమిడి ఉంటాయి. ఈ అంశాలన్నీ అందరిలోనూ ఒకేలా ఉండవ్ఞ. భిన్నత్వం ఉండటం సహజం. ఆ భిన్నత్వంలో ప్రత్యేకత తొంగిచూస్తుంది. ఆ ప్రత్యేకతే ఆ వ్యక్తి వ్యక్తిత్వమవ్ఞతుంది. వ్యక్తిత్వం – నీతి నిజాయితీలతోపాటు వారి సంపూర్ణ లక్షణాలు, వారి ప్రతిస్పందనల వైఖరి అన్నింటికీ వర్తిస్తుంది. ఈ ప్రత్యేకతే మిమ్మల్ని ఇతరులకన్నా భిన్నంగా, మీ ప్రయత్నం వల్ల ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. బాహ్యమైన ల్‌క్షణాలు ఆకట్టుకునే రూపురేఖలే వ్యక్తిత్వం అనుకోకండి. మీ వంశపారంపర్య లక్షణాలు, మీరు పెరిగిన వాతావరణం, ఈ రెండు అంశాలు ప్రధానంగా కలిసి వాటికి పరస్పర ప్రతిచర్యల కారణంగా మీ వ్యక్తిత్వం ఏర్పడుతుంది. మన పుట్టుక మన చేతిలో లేదు కాబట్టి వంశపారంపర్యంగా సంక్రమించిన లక్షణాలకు సంబంధించి మనం చేయగలిగింది ఎక్కువ ఉండకపోవచ్చు. అలాగే మీరు పెరిగిన పరిస్థితుల ప్రభావం మీపై ప్రబలంగా ఏర్పడి ఉంటుంది. ప్రభావాన్నుంచి తప్పించుకోవటం అంత తేలిక కాదు. కృషి చేస్తే మీ ప్రస్తుత వ్యక్తిత్వాన్ని తప్పకుండా అభివృద్ధి పరచు కోగలుగుతారు.