ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షలో కనిమొళి

Kanomozhi
Kanomozhi

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్‌ ఆర్టీ ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష చేపట్టిన విషయం విదితం. ఈ దీక్షకు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డిఎంకె ఎంపీ కనిమొళి మద్ధతు పలికి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రేత్యక హోదా ఆంధ్రుల హక్కు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఏపి ప్రజల పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ రోజు దీక్షలో కాంగ్రెస్‌ లోక్‌సభపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. ఆండ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాల్సిందేనని అన్నారు. అదికారంలోకి వస్తే తమ పార్టీకి ప్రత్యేక హోదా ఇస్తుందని తెలిపారు.